
కరోనా ఎఫెక్టుతో టాలీవుడ్లో షూటింగులు వాయిదాపడటంతో ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ తలకిందలయ్యాయి. కొన్నినెలలపాటు షూటింగులు నిలిచిపోవడంతో దర్శక, నిర్మాతలు, స్టార్ హీరోలు, నటీనటుల డేట్స్ అన్ని కూడా కింద మీద అవుతున్నాయి. దీంతో కొత్త సినిమాలను తెరకెక్కించడంలో స్టార్ హీరోలు, దర్శకులు ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: తల్లికి వోడ్కా తాగిస్తున్న వర్మ !
దీనికితోడు మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి బడాహీరోలు దర్శకదిగ్గజం రాజమౌళి చేతిలో ఇరుక్కుపోయారు. కరోనా కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ ఆలస్యం అవుతుండటంతో ఆ ప్రభావం ఇతర సినిమాలపై పడుతుంది. రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తూనే ‘ఆచార్య’లో నటించనున్నాడు. ఇది మినహా మరే సినిమాలను కూడా రాంచరణ్ అధికారికంగా ప్రకటించలేదు.
ఎన్టీఆర్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ త్వరగా అవుతుందని భావించి దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీని ప్లాన్ చేసుకున్నాడు. ఈమేరకు చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే కరోనా కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ ఆలస్యం కావడంతో త్రివిక్రమ్ తో సినిమా ఇప్పట్లో లేదనే ప్రచారం జరిగింది. ఈలోపు త్రివిక్రమ్ రామ్ తో ఓ మూవీ చేయనున్నాడనే టాక్ విన్పించింది.
Also Read: సినిమాలు ఆపేస్తానని చెప్పేవాడట !
తాజా సమాచారం మేరకు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఈ వేసవిలోపు పూర్తి చేసేందుకు దర్శకుడు రాజమౌళి సన్నహాలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యం అవుతుండటంతో త్వరగా కాంప్లీట్ చేసి హీరోలను రిలీవ్ చేయాలని భావిస్తున్నాడట. దీనిలో భాగంగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఈమేరకు ఎన్టీఆర్ మార్చి నుంచి తన డేట్స్ త్రివిక్రమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో త్రివిక్రమ్ స్క్రీప్టు పనులతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. ఇక ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కే మూవీకి ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.