
కేరళలోని అయ్యప్పస్వామి సన్నిధానంలో కరోనా పంజా విసిరింది. ఆలయ సిబ్బందికి,పోలీసులు, యాత్రికులకు కలిపి 39 మందికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఈనెల 16 నుంచి శబరిమలై ఆలయంలోకి కోవిడ్ నిబంధనలతో అనుమతినిస్తున్నారు. రోజుకు వెయ్యి మందికి మాత్రమే దర్శనాన్ని కల్పిస్తున్నారు. అయితే సన్నిధానం, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పాయింట్లలో మొత్తం 39 కరోనా కేసులు నమోదైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. కాగా ప్రతిఏటా నిర్వహించే మండల పూజను ఈ సారి కూడా డిసెంబర్ 26న నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. కోవిడ్ నిబంధనలతో ఆలయానికి వచ్చి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటున్నారు.