https://oktelugu.com/

శివసేన కండువా కప్పుకున్న ఊర్మిళ: ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం..?

కాంగ్రెస్ నేత, బాలీవుడ్ నటి ఊర్మిళ శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో మంగళవారం పార్టీ కండువా కప్పుకున్నారు. బాలీవుడ్ లో ప్రముఖంగా ఉన్న ఊర్మిళ 2019లో కాంగ్రెస్లో చేరారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో వ్యవహారాలు నచ్చకపోవడంతో పార్టీని వీడుతున్నట్లు ఊర్మిళ ప్రకటించింది. అయితే గవర్నర్ కోటాలో శివసేన ఊర్మిళకు ఎమ్మెల్సీ పదవి […]

Written By: , Updated On : December 1, 2020 / 02:56 PM IST
Follow us on

కాంగ్రెస్ నేత, బాలీవుడ్ నటి ఊర్మిళ శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో మంగళవారం పార్టీ కండువా కప్పుకున్నారు. బాలీవుడ్ లో ప్రముఖంగా ఉన్న ఊర్మిళ 2019లో కాంగ్రెస్లో చేరారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో వ్యవహారాలు నచ్చకపోవడంతో పార్టీని వీడుతున్నట్లు ఊర్మిళ ప్రకటించింది. అయితే గవర్నర్ కోటాలో శివసేన ఊర్మిళకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే బాలీవుడ్ నటి కంగనా రానౌత్ శివసేనపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు.  దీంతో కంగానాపై  శివసేన నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యలో ఊర్మిళను చేర్చుకొని పదవి ఇవ్వడంపై చర్చనీయాంశంగామారింది.