
పంజాబ్‌లో పది శాఖలను పునర్‌నిర్మాణం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. దీనికి రాష్ట్ర కేబినేట్ సైతం ఆమోదం తెలిసింది. ఈ శాఖల పునర్‌నిర్మాణం పూర్తైతే 50 వేల నూతన నియామకాలను కొద్ది నెలల్లోనే పూర్తి చేయనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా ఉద్యోగాలకు నియామకాలు జరగాల్సి ఉంది. చాలా కాలంగా ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాటి నియామకం ఆలస్యమవుతోందని ప్రభుత్వం వాదిస్తోంది. వీటితో పాటు ఇప్పుడు చేపట్టబోయే పని వల్ల క్రియాత్మక సామర్ధ్యం పెరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.