
తిండి, బట్ట, గూడు మూడు ప్రజలకు ఉండాలనే తమ ప్రభుత్వం ఆశయమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో ఇళ్ల పట్టాలపై స్టే ఉందని తెలిపారు. హామీ పత్రం ఇస్తున్నామని, త్వరలోనే పట్టాలు ఇస్తామని ప్రకటించారు. విశాఖలో భూములు ఆక్రమించిన వారిలో టీడీపీ నేతలే ఎక్కువ మంది ఉన్నారని ఆరోపించారు. ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు స్వచ్ఛందంగా ఇవ్వాలని, లేకపోతే కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.