
స్పెక్ట్రం తదుపరి రౌండ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ బుధవారం తెలిపారు. చెరుకు రైతులకు ఉపశమనం, ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధిం, స్పెక్ట్రం వేలం తదితర అంశాలపై చర్చించి, కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. స్పెక్ట్రం తదుపరి రౌండ్ వేలానికి ఇప్పటివరకూ నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా, వేలంలో రూ.5.22 లక్షల కోట్లు విలువైన ఎయిర్‌వేస్‌ను విక్రయించాలని నిర్ణయించారు.