టీపీసీసీ రేస్.. పదవులపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేకపాయే..!

తెలంగాణ పీసీసీ పదవీ కోసం కాంగ్రెస్ నేతలందరు వెంపర్లాడుతున్నారు. అదేదో సీఎం పదవీ అయినట్లు ఒకరిని మించి మరొకరు లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల వాలకంచూసిన అధిష్టానం సైతం ఎటూ తేల్చలేక ప్రస్తుతానికి పీసీసీ చీఫ్ ప్రకటనను వాయిదా వేసింది. పీసీసీ రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి.. మల్లు భట్టి విక్రమార్క..శ్రీధర్ బాబు పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. వీరితోపాటు వీహెచ్ హన్మంతరావు.. మధుయాష్కీ.. సంపత్ తదితరుల పేర్లు కూడా తెరపైకి […]

Written By: Neelambaram, Updated On : December 16, 2020 8:17 pm
Follow us on

తెలంగాణ పీసీసీ పదవీ కోసం కాంగ్రెస్ నేతలందరు వెంపర్లాడుతున్నారు. అదేదో సీఎం పదవీ అయినట్లు ఒకరిని మించి మరొకరు లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల వాలకంచూసిన అధిష్టానం సైతం ఎటూ తేల్చలేక ప్రస్తుతానికి పీసీసీ చీఫ్ ప్రకటనను వాయిదా వేసింది.

పీసీసీ రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి.. మల్లు భట్టి విక్రమార్క..శ్రీధర్ బాబు పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. వీరితోపాటు వీహెచ్ హన్మంతరావు.. మధుయాష్కీ.. సంపత్ తదితరుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

సీనియర్ నేతలుగా పేరున్న జానారెడ్డి.. దామోదర రాజనర్సింహాలు తాము సైతం రేసులో ఉన్నట్లు ప్రకటించుకున్నారు. జానారెడ్డి ఒక అడుగు ముందుకేసీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం క్యాండెట్ అంటూ ప్రకటించుకోవడం గమనార్హం.

కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తుంటే వీరికి పదవులపైనే శ్రద్ధ అని ప్రజా సమస్యలపై లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి రాకపోవడానికి కాంగ్రెస్ నేతల వ్యవహరమే కారణమనే టాక్ విన్పిస్తోంది.

కాంగ్రెస్ నేతలు పదవులపై చూపే శ్రద్ధలో కనీసం ఒక్క వంతైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడితే ఆపార్టీ ఎప్పుడో అధికారంలోకి వచ్చేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రూపు రాజకీయాలే కాంగ్రెస్ కు శాపంగా మారయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాల వల్లే టీపీసీసీ పదవీ కోసం నేతల లిస్టు పెరిగినట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ లో టీపీసీసీ పదవీ ఎవరికీ దక్కినా అది కత్తి మీద సాములా మారేలా కన్పిస్తోంది. అయితే నేతల తీరు చూస్తుంటే మాత్రం 2023లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.