బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి విజయవంతం

క్షిపణి ప్రయోగాల్లో భారత్ ఒక్కో అడుగు వేస్తూ విజయపథంలో నడుస్తోంది. చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలను చేపట్టింది. తాజాగా భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కోల్ కతా శ్రేషి డెస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ చెన్నై’ యుద్ధ నౌకను ఆదివారం పరీక్షించారు. అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించడంతో శాస్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ బ్రహ్మోస్ క్షిపణులు దాదాపు […]

Written By: Suresh, Updated On : October 18, 2020 1:54 pm
Follow us on

క్షిపణి ప్రయోగాల్లో భారత్ ఒక్కో అడుగు వేస్తూ విజయపథంలో నడుస్తోంది. చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలను చేపట్టింది. తాజాగా భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కోల్ కతా శ్రేషి డెస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ చెన్నై’ యుద్ధ నౌకను ఆదివారం పరీక్షించారు. అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించడంతో శాస్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ బ్రహ్మోస్ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకోగలవు. దీనిని ఇండియన్ నేవీ ప్రాజెక్టు 15 A లో భాగంగా స్వదేశీయంగా అభివృద్ధి చేశారు. 164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువున్న ఈ క్షిపణి 30 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోతుంది.