
పశ్చిమ బెంగాల్ లో కమల వికాసం కష్టమని, 2021లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ 30 సీట్ల కంటే ఎక్కువ గెలుచుకోలేదని, పేరుకు మాత్రమే మిషన్ 200 అని ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు తమవైపే ఉన్నారని, బెంగాల్ ను తృణమూల్ కాంగ్రెస్ అభివృద్ధి చేసిన విధానం, అందించిన పాలనతో ప్రజలు తమవైపే ఉంటరాని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మమతా బెనర్జీ తెలిపారు. ఇదిలా ఉంటె, తృణమూల్ నేతలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కమలం పార్టీలో చేరుతున్న తరుణంలో పార్టీలో, కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహజమే అని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని కాషాయదళపతులు చెప్తున్నారు.