Homeఎంటర్టైన్మెంట్బాలయ్య సినిమాలో పవర్ స్టార్ !

బాలయ్య సినిమాలో పవర్ స్టార్ !

నట సింహం బాలయ్య బాబు కొత్త సినిమాలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించబోతున్నాడని తెలుస్తోంది. కాగా పునీత్ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందని.. పోలీస్ ఆఫీసర్ గా పునీత్ కనిపిస్తాడని.. కేవలం రెండు సీన్స్ లో మాత్రమే పునీత్ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి ఈ సినిమాలో ఒక మూగ – చెమిటి పాత్ర ఉందని.. ఇది నలభై నిమషాల కీలక […]

Balakrishna
నట సింహం బాలయ్య బాబు కొత్త సినిమాలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించబోతున్నాడని తెలుస్తోంది. కాగా పునీత్ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందని.. పోలీస్ ఆఫీసర్ గా పునీత్ కనిపిస్తాడని.. కేవలం రెండు సీన్స్ లో మాత్రమే పునీత్ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి ఈ సినిమాలో ఒక మూగ – చెమిటి పాత్ర ఉందని.. ఇది నలభై నిమషాల కీలక పాత్ర అని.. ఈ పాత్రలో క్రేజీ హీరో నాగశౌర్య నటించబోతున్నాడని రీసెంట్ గా ఈ వార్త బాగా వైరల్ అయింది. మరి ఇప్పుడు ఉన్నట్లు ఉండి పునీత్ రాజ్ కుమార్ లైన్ లోకి రావడం నిజంగా విశేషమే.

Also Read: వాడుకోవట్లేదని ఫీల్ అవుతోన్న శ్రీముఖి !

కాగా ఈ సినిమా ఫుల్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ గానూ ఉంటుందని ఇప్పటికే బోయపాటి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బోయపాటి మాటలను బట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్ధం అవుతుంది. సహజంగా బాలయ్య సినిమాలో బాలయ్య ఒక్కరే హైలైట్ అవుతాడు, డైరెక్టర్ ఎవరు అయినా సినిమాల వ్యవహారశైలి అలాగే ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కాబట్టి మరో నటుడికి బాలయ్య సినిమాలో అంత గొప్ప స్కోప్ ఉండదు. మరి అలాంటప్పుడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించేంత స్కోప్ ఈ సినిమాలో ఏముందో చూడాలి.

Also Read: వారంలోనే కరోనాని జయించిన స్టార్ హీరోయిన్ !

కాగా యంగ్ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎక్కడా వెనుక అడుగు వేయకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే తమన్ రెండు సాంగ్స్ ను కూడా కొట్టాడట. మరి సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించి, బాలయ్య ఫ్యాన్స్ కు ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. కాకపోతే బాలయ్యకు హిట్లే వరుసగా రావు అనుకోండి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper