బీహార్: మూడు రోజులకే మంత్రి పదవికి రాజీనామా

జాతీయ గీతం సరిగ్గా పాడనందుకు ఆ మంత్రిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. విద్యాశాఖ మంత్రి అయి ఉండి కూడా ‘జగగణమణ’ గీతాన్నితప్పుగా పాడినందుకు ప్రతిపక్షాలతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరికి ఆ మంత్రి రాజీనామా చేశారు. బీహార్ లో చోటుచేసుకున్న ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. బీహార్ లో మూడు రోజుల కిందట 14 మంది మంత్రులతో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో తారాపూర్ నియోజకవర్గం నుంచి జేడీయూ తరుపున ఎమ్మల్యేగా ఎన్నికైన […]

Written By: Suresh, Updated On : November 19, 2020 4:55 pm
Follow us on

జాతీయ గీతం సరిగ్గా పాడనందుకు ఆ మంత్రిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. విద్యాశాఖ మంత్రి అయి ఉండి కూడా ‘జగగణమణ’ గీతాన్నితప్పుగా పాడినందుకు ప్రతిపక్షాలతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరికి ఆ మంత్రి రాజీనామా చేశారు. బీహార్ లో చోటుచేసుకున్న ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
బీహార్ లో మూడు రోజుల కిందట 14 మంది మంత్రులతో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో తారాపూర్ నియోజకవర్గం నుంచి జేడీయూ తరుపున ఎమ్మల్యేగా ఎన్నికైన మేవాలాల్ చౌదరికి విద్యాశాఖను కేటాయించారు. అయితే మేవాలాల్ గతంలో వ్యవసాయ వర్సిటీకి వైస్ చాన్స్ లర్ గా పనిచేశారు. వర్సిటీ పరిధిలో నిర్మించిన భవనాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో ఆర్జేజీ నాయకులు ఆరోపించారు. ఇదే తరుణంలో పాఠశాల వ్యవహారంలో విమర్శలు రావడంతో ఆయన తన మంత్రి పదవి నుంచి వైదొలిగారు.