
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఓ ”భూ ఆక్రమణ” కేసుకు సంబంధించి సీఎం మమత తనకు ఎంతో అండగా నిలిచారంటూ ఆమెను అభినందించారు. శాంతి నికేతన్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ ఆవరణంలో కొందరు ప్రయివేటు వ్యక్తులు ”చట్ట విరుద్ధంగా భూ ఆక్రమణకు” పాల్పడ్డారంటూ వర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ”కబ్జాకు” పాల్పడిన వారిలో అమర్త్యసేన్ పేరు కూడా ప్రస్తావిస్తూ విశ్వభారతి ట్రస్ట్ ప్రశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసింది