మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. కార్మికుడి మలద్వారం గుండా కంప్రెషర్ తో గాలిని పంపింగ్ చేయడంతో అతను మరణించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి సూపరింటెండెంట్ పోలీస్ రాజేశ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం శివపురికి చెందిన ప్రేమానంద్ తాను పనిచేసే చోట జీతం ఇవ్వాలని యజమానిని అడిగాడు. దీంతో యజమాని కోపంతో ప్రేమానంద్ మలద్వారంలోకి కంప్రెషర్ గాలిని పంపించాడు. దీంతో అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమానంద్ శనివారం మ్రుతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. కాగా ఈ విషయంపై ప్రేమానంద్ సోదరుడు ధనిరామ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.