https://oktelugu.com/

గుడ్ న్యూస్.. పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ టీజర్! ఎప్పుడో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా టీజర్‌ ను విడుదల చేసేందుకు మేకర్స్ టైమ్ సెట్ చేశారు. న్యూ ఇయర్ రోజున వకీల్ సాబ్ టీజర్ రాబోతుంది. నిజానికి అ మధ్యే టీజర్ వస్తోందని ప్రచారం జరిగినా.. వకీల్ సాబ్ మేకర్స్ మాత్రం టీజర్ విడుదల చేయలేదు. అయినా పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందకుండా పవన్ నుండి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నట్టు ఈ ఏడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన […]

Written By:
  • admin
  • , Updated On : December 27, 2020 / 02:42 PM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా టీజర్‌ ను విడుదల చేసేందుకు మేకర్స్ టైమ్ సెట్ చేశారు. న్యూ ఇయర్ రోజున వకీల్ సాబ్ టీజర్ రాబోతుంది. నిజానికి అ మధ్యే టీజర్ వస్తోందని ప్రచారం జరిగినా.. వకీల్ సాబ్ మేకర్స్ మాత్రం టీజర్ విడుదల చేయలేదు. అయినా పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందకుండా పవన్ నుండి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నట్టు ఈ ఏడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో ‘వకీల్ సాబ్’ కూడా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమాలకు గ్యాప్ ఇచ్చినా పవన్ స్టార్ డమ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని ట్రెండ్ అయిన ట్యాగ్ ను బట్టి అర్ధం అవుతొంది.

    Also Read: హనీమూన్ కోసం ‘నిహారిక’ జంట.. !

    కాగా వకీల్ సాబ్ మరో వారం రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది. జనవరి 2న నుండి షూట్ మొదలుపెట్టి త్వరగా పూర్తి చేయాలని వరుస డేట్స్ ను పవన్ కేటాయించాడట. రామోజీ ఫిల్మ్ సిటీలో వకీల్ సాబ్ కోసం వేసిన ప్రత్యేక భారీ కోర్టు సెట్ లో ఈ వారం రోజుల పాటు షూట్ జరగనుంది. అసలు ఈ సినిమా మధ్యలో అగకపోయి ఉంటే ఎప్పుడో జూన్ లోనే రిలీజ్ అయి పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ను ఇచ్చేది, కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు మధ్యలోనే ఆగి.. దాదాపు రెండు సంవత్సరాలు లేట్ అయిపొయింది ఈ సినిమా.

    Also Read: బిగ్ బాస్ తో రహస్య ఒప్పందం వల్లే మోనాల్ కి ఛాన్స్ !

    ఇప్పటికే వకీల్ సాబ్ షూట్ ను నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరిపి.. ఆ తరువాత వెంటనే క్రిష్ తో చేస్తోన్న సినిమాను కూడా మొదలుపెడతాడట పవన్. క్రిష్ – పవన్ సినిమాను వచ్చే విజయదశమి పండుగ కానుకగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయట. కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకురానున్నారు. అందుకే గ్రాండ్ నెస్ ను తీసుకు వచ్చేందుకు పరభాషా నటులను కూడా క్రిష్ ఈ సినిమా కోసం ఎంచుకుంటున్నారు. పైగా క్రిష్ ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడని.. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్