Afghanistan Bagram Air Base: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీనిపై ఎన్‌ఐఏ విచారణ తర్వాత పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 9 ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి ధ్వసం చేసింది. దీంతో పాకిస్తాన్ రంగంలోకి దిగింది. భారత్‌పై సరిహద్దుల వెంట దాడులకు తెగబడింది. డ్రోన్లు, మిసైళ్లు ప్రయోగించింది. భారత్ వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంతోపాటు భారత వాయుసేన జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌లోని 11 ఎయిర్‌బేస్‌లు ధ్వంసం అయ్యాయి. అణుస్థావరం కూడా పాక్షికంగా ధ్వంసమైంది. డీజీఎంవో స్థాయి చర్చల తర్వాత ఇరు దేశాల మధ్య సీజ్‌ఫైర్ కుదిరింది. అయితే ఆపరేషన్ సిందూర్ 1.0 తర్వాత భారత మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరో తేలిపోయింది. భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మళ్లీ కవ్వింపు జరిపితే ఈసారి భూమిపై పాకిస్తాన్ లేకుండా చేయడమే లక్ష్యంగా భారత్ పావులు కదుపుతోంది.
Also Read: కేసీఆర్ కు ఏమైంది? ఆయన ఆరోగ్యాన్ని ఎందుకు దాస్తున్నారు?
ఆఫ్గాన్‌తో వ్యూహాత్మక ఒప్పందం?
పాకిస్తాన్‌పై భారత్ ఒత్తిడిని పెంచే క్రమంలో ఆఫ్గానిస్తాన్‌లో కలిసి కీలక వ్యూహం రూపొందిస్తోంది. కాబూల్ సమీపంలోని బద్రాంగ్ ఎయిర్ బేస్‌ను భారత్ కి అప్పగించేందుకు తాలిబాన్ పాలన సుముఖత చూపడం, దౌత్య రంగంలో కొత్త అధ్యాయానికి నాంది కానుంది. ఈ స్థావరం వ్యూహాత్మకంగా ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే దాని భౌగోళిక స్థానమే చాలదు. అది పెషావర్ నుంచి కేవలం ఆరు గంటల దూరంలో ఉంది. ఆపరేషన్ సిందూర్ 2.0 సన్నాహక వ్యాఖ్యలను మన సైన్యాధిపతి, రక్షణ మంత్రులు ఇటీవల చేసిన సూచనలతో అనుసంధానం చేస్తే, భారత్ ఈ బేస్‌పై అధ్యయనం జరుపుతోందని విశ్లేషకుల అంచనా. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇచ్చిన హెచ్చరికలు, ఆర్మీ చీఫ్ మాటల మధ్య స్పష్టమైన అనుసంధానం కనిపిస్తోంది.
ఆఫ్గాన్–ఇండియా భద్రతా వలయం
బద్రాంగ్ ఎయిర్ బేస్ భారత్ తీసుకుంటే..కమ్యూనికేషన్, డ్రోన్ కంట్రోల్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. దీంతో మధ్య ఆసియా నుంచి పశ్చిమ ఆసియా వరకు భారత వాయుసేనను విస్తరించవచ్చు. ప్రత్యేకించి పెషావర్, ఖైబర్ పాఖ్తూన్, బలూచిస్తాన్ ప్రాంతాలు పర్యవేక్షణలోకి వస్తాయి. పాక్ పశ్చిమ సరిహద్దు నుంచి భారత్ ఏవైనా ఆపరేషన్లు ప్రారంభిస్తే, అవి తక్షణంలోనే భూభాగంలో లోతుకు చొచ్చుకుపోతాయి. తజకిస్తాన్‌లోని ఫార్కోల్ స్థావరంతో కలిపి బద్రాంగ్ భారత్ నిర్బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ క్రాస్‌రూట్ మిలిటరీ చెయిన్ పాకిస్తాన్‌ను రెండు వైపులా ఒత్తిడిలో ఉంచుతుంది.
పాక్‌ను నలువైపులా చుట్టుముట్టేలా..
ఇప్పుడు ఇప్పటికే బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్‌ఎతాలిబాన్‌ల దాడులతో పాకిస్తాన్ అంతర్గతంగా అస్తవ్యస్తంగా ఉంది. జమ్మూకశ్మీర్‌లో కూడా సైనిక ఆపరేషన్లు విస్తరించుతుండటంతో ఇస్లామాబాద్ ఆందోళనలో పడింది. ఇటువంటి పరిస్థితిలో భారత్ బద్రాంగ్ బేస్ బాధ్యత తీసుకుంటే, పాక్ వ్యూహాత్మక భద్రత పునఃసమీక్ష తప్పదని అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు.
వఖాన్ కారిడార్‌పై పట్టు
భారత్ – ఆఫ్గాన్ సహకారం వఖాన్ కారిడార్ దిశగా కూడా విస్తరించే అవకాశం ఉంది. ఆ మార్గంపై భారత్ మౌలిక వసతులు నిర్మిస్తే, సెంట్రల్ ఆసియా వనరులకో, రవాణా మార్గాలకో సులభ యాక్సెస్ పొందవచ్చు. ఇది చైనా–పాక్ ఆర్థిక మార్గానికి ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.
మొత్తంగా బద్రాంగ్ ఎయిర్ బేస్ భారత్ అధీనంలోకి వస్తే, అది కేవలం ఒక స్థావరం కాదు పాకిస్తాన్‌కు వ్యూహాత్మక చెక్ అవుతుంది. ఆసియా శాంతిసమీకరణలో కీలక మార్పు. దాంతో భారత్–పాక్ బోర్డులో కొత్త గేమ్ మొదలయ్యే సూచన అంతప్రత్యక్షంగా కనిపిస్తోంది.