తనపై విష ప్రయోగం జరిగిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సంచలన ప్రకటన చేశారు. ఇస్రోకు చెందిన తపన్ మిశ్రా ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అందులో మూడేళ్ల కిందట అనగా 2017 మే 23న తాను తీసుకునే ఆహారంలో ఆర్సెనిక్ ను కలిపారని, దానిని తిన్న తను ఏయిమ్స్ లో చికిత్స పొందానని తెలిపారు. అప్పటి నుంచి తన చర్మంపై చిన్న బొడిపెలు రావడంతో పాటు చర్మం పెచ్చులుగా ఊడిపోయిందన్నారు. ప్రస్తుతం ఇస్రోలో సీనియర్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. ఆ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలని ఆయన కోరారు.