రాజకీయంలో ప్రత్యర్థులు కామన్.. అది అధికార, ప్రతిపక్ష పార్టీలైతే ఓకే. కానీ.. స్వపక్షంలోనే విపక్షం ఉంటే. ఇక రోజూ కొట్లాటలే. సరిగా ఏపీ వైసీపీలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఏకంగా ప్రభుత్వంలో భాగమైన ఇద్దరు మంత్రుల మధ్యనే పొసగడం లేదట. అందుకే.. ఓ మంత్రికి ఇంకో మంత్రి ఎసరు పెడుతున్నారని టాక్. కొన్నాళ్లుగా ఈ ఇద్దరి మంత్రుల మధ్య వివాదం కొనసాగుతోంది.
Also Read: సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్.. ఎవరు చేశారు? ఎందుకు?
అయితే.. ఈ ఇద్దరూ కూడా ఎదురు పడినప్పుడల్లా నవ్వుతూ పలకరించుకుంటూ.. వెనక మాత్రం వెక్కిరించుకుంటున్నారు. దీంతో ఈ ఇద్దరు మంత్రుల విషయం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి.. విజయవాడకు చెందిన మంత్రికి ఎసరు పెడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అసలు వీరిద్దరి మధ్య ఎందుకు వివాదం వచ్చింది..? ఇద్దరి మధ్య ఎందుకు పొసగడం లేదు..? ఓ మంత్రికి ఇంకో మంత్రి ఎసరు పెట్టేవరకూ పరిస్థితి ఎందుకు వచ్చింది..? అనేది ప్రధాన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సదరు సీమ మంత్రికి.. కోస్తా జిల్లాల్లో మంచి సన్నిహితులు ఉన్నారు. ఆయన కనుసన్నల్లోనే పార్టీ నడుస్తోంది. ఇక్కడ ఆయన మాటకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే.. రాను రాను విజయవాడ మంత్రి వర్యుల కనుసన్నల్లోకి వచ్చిన కొందరు నాయకులు ఇక్కడ సదరు సీమకు చెందిన మంత్రిని ఖాతరుచేయడం లేదట. దీంతో ఇరువురు మంత్రుల మధ్య ఆధిపత్యానికి దారితీసింది.
Also Read: ఏపీలో దేవాలయాలపై దాడులు.. కేంద్రం జోక్యం?
‘పార్టీని బలోపేతం చేయడంలో నేనే ముందున్నాను. ఇప్పటికి ముగ్గురిని పార్టీలోకి తీసుకువచ్చాను. అంతర్వేది వంటి ఘటనలు చెలరేగినా.. వ్యూహాత్మకంగా అడ్డుకున్నాను’ అని సదరు విజయవాడకు చెందిన మంత్రి తనను తానే పొగిడేసుకుంటున్నారు. మరోవైపు.. ఇసుక, మద్యం విషయాల్లో ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని.. తల ఎత్తుకోలేక పోతోందని పరోక్షంగా వ్యాఖ్యలు సంధిస్తున్నారు. అంటే.. ఈ రెండు శాఖలు సీమకు చెందిన మంత్రి చేతిలోనే ఉన్నాయి. పరోక్షంగా ఆయనను టార్గెట్ చేసుకున్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో సీమ మంత్రి ఫైర్ అయ్యారని అంటున్నారు. మొత్తానికి జిల్లాలు మారి మరీ మంత్రులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయిస్తుండడం గమనార్హం. మరి ఈ ఆధిపత్య పోరు చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్