వంట గ్యాస్ ధర రూ.50 పెంచేందుకు నిర్ణయం

వంట గ్యాస్ వినియోగదారులకు మార్కెటింగ్ సంస్థలు షాకిచ్చాయి. ప్రతీ సిలిండర్ పై రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పడున్న ధరలకు అదనంగా రూ.50 పెంచుతున్నామని వారు ప్రకటించారు. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని మార్కెటింగ్ సంస్థలు తెలిపారు. దీంతో ఢిల్లీలో సబ్సడీ సిలిండర్ ధర రూ.594 నుంచి రూ.644వరకు పెరుగుతుంది. హైదరాబాద్ లో రూ.646.50 ఉండగా రూ.50 పెంపుతో రూ.696.50గా ధర ఉండే అవకాశం ఉంది. దేశంలో చమురు ధరలు పెరుగుతండడంతో తాజాగా గ్యాస్ ధర […]

Written By: Suresh, Updated On : December 2, 2020 12:05 pm
Follow us on

వంట గ్యాస్ వినియోగదారులకు మార్కెటింగ్ సంస్థలు షాకిచ్చాయి. ప్రతీ సిలిండర్ పై రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పడున్న ధరలకు అదనంగా రూ.50 పెంచుతున్నామని వారు ప్రకటించారు. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని మార్కెటింగ్ సంస్థలు తెలిపారు. దీంతో ఢిల్లీలో సబ్సడీ సిలిండర్ ధర రూ.594 నుంచి రూ.644వరకు పెరుగుతుంది. హైదరాబాద్ లో రూ.646.50 ఉండగా రూ.50 పెంపుతో రూ.696.50గా ధర ఉండే అవకాశం ఉంది. దేశంలో చమురు ధరలు పెరుగుతండడంతో తాజాగా గ్యాస్ ధర రేట్లను పెంచినట్లు తెలుస్తోంది.