https://oktelugu.com/

ఇసుక విధానంపై టీడీపీ నేతల నిరసన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ఇసుక సమస్యలపై చర్చ సాగింది. నూతన ఇసుక విధానంతో భనవ నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అనంతరం బయటకు వచ్చిన టీడీపీ నేతలు వినూత్నంగా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ గతంలో ఉచితంగా పంపిణీ చేసిన ఇసుకను నేడు భారంగా మారిందన్నారు. ఇసుక సమస్యతో రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. కొత్త విధానం ప్రకటించకుండానే టీడీపీ […]

Written By: , Updated On : December 2, 2020 / 12:15 PM IST
Follow us on

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ఇసుక సమస్యలపై చర్చ సాగింది. నూతన ఇసుక విధానంతో భనవ నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అనంతరం బయటకు వచ్చిన టీడీపీ నేతలు వినూత్నంగా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ గతంలో ఉచితంగా పంపిణీ చేసిన ఇసుకను నేడు భారంగా మారిందన్నారు. ఇసుక సమస్యతో రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. కొత్త విధానం ప్రకటించకుండానే టీడీపీ అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారన్నారు. పనుల్లేక ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులవన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు.