Ram Charan OG Movie: నేడు విడుదలైన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు వింటేజ్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ అయ్యాడు అంటూ ఆనందం తో సంబరాలు చేసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ఎవ్వరూ గమనించని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవి సూక్ష్మంగా గమనించిన వారికే అర్థం అవుతుంది. సినిమా విడుదలకు ముందే ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యారక్టర్ ఉంటుందని ఒక లీక్ వచ్చింది. ఓజీ లాంటి గ్యాంగ్ స్టర్ మూవీ లో సుభాష్ చంద్రబోస్ ఉండడం ఏంటి, అసలు సుజిత్ ప్లాన్ ఏంటి? అంటూ అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. కానీ నేతాజి కి సంబంధించిన సన్నివేశాలు ఏమి లేకపోవడం తో సోషల్ మీడియా లో ప్రచారమైంది కేవలం రూమర్ మాత్రమేనేమో అని అనుకున్నారు.
కానీ నేతాజీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు మొత్తం సీక్వెల్ లో ప్లాన్ చేస్తున్నారట. ఈ క్యారక్టర్ ని చేసేది మరెవరో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఒక సన్నివేశం లో రామ్ చరణ్ సుభాష్ చంద్రబోస్ గెటప్ లో ఉన్న ఒక ఫోటో కనిపిస్తుంది. దీనిని ఆడియన్స్ కొంతమంది గమనించి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. ఊహకు అంతు అనేదే లేదు కదా, సుజిత్ ఈ విధంగా ఊహించాడు అంటూ చెప్పుకొచ్చారు నెటిజెన్స్. దీనిని ఆధారంగా తీసుకొని అభిమానులు తమకు తోచిన విధంగా కథలు అల్లేస్తున్నారు. అవి ఎంత వరకు నిజం అవుతాయి అనేది తెలీదు. నేడు సక్సెస్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సుజిత్ ని ఓజీ కి సీక్వెల్ ఉంటుందా అని అడిగితే, ప్రకటించాము, కానీ నా దగ్గర ప్రస్తుతానికి అందుకు కావాల్సిన స్క్రిప్ట్ లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అంటే రామ్ చరణ్ ఫోటో ని పార్ట్ 2 ని ఊహించుకొని ఈ సినిమా పెట్టలేదు, ఫ్యాన్ మూమెంట్ కోసం పెట్టాడు అని ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఫ్యాన్స్ మాత్రం సుజిత్ దగ్గర స్క్రిప్ట్ రెడీ గానే ఉంది, ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఇలా దాచి పెట్టి మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.