
కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుంది అంటారు. పెళ్లినాటి ప్రమాణాలు తుంగలో తొక్కింది. ఏడడుగుల బంధానికి ప్రతిబంధకం అయింది. కట్టుకున్న భర్తనే కాదంది. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. మొదటి భర్తకు తెలియకుండానే రెండో పెళ్లికి రెడీ అయింది. అతడి ప్రేమను తిరస్కరించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె రెండో పెళ్లికి సిద్ధపడడంతో మొదటి భర్త అవాక్కయ్యాడు. సోషల్ మీడియాలో తన భార్య పెళ్లిని చూసి నిర్ఘాంతపోయాడు. మహిళలను నమ్మడం మంచిది కాదని బోరుమంటున్నాడు. భార్య అనే బంధానికే చిక్కు తెచ్చింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలోని బాబూపార్ లో అమిత్ శర్మ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అదే జిల్లాలోని గోవింద్ నగర్ లో రుచిశర్మ అనే యువతి ఉంటోంది. మూడు సంవత్సరాల క్రితం ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ప్రేమికులుగా మారారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ఇష్టాన్ని పెద్దలకు తెలియజేశారు. పెద్దలు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో కరోనా మొదటి దశలో 2020 జూన్ 4న వివాహం చేసుకున్నారు. పెళ్లి సందర్భంలో వరుడికి వధువు కుటుంబ సభ్యులు భారీగానే నగలు, నగదు ముట్టజెప్పారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న అమిత్, శర్మ నాలుగు నెలలు చక్కగానే కాపురం చేశారు. తరువాత పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పడంతో అమిత్ సరే అన్నాడు. దీంతో ఆమె పుట్టింటికి చేరింది. అయితే పుట్టింటిలో ఉన్న భార్యను కాపురానికి రావాలని ఫోన్ చేశాడు. కానీ ఆమె స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నాళ్లకయినా తిరిగి వస్తుందనే ఆశతోనే అమిత్ ఎదురు చూడ సాగాడు.
మూడు రోజుల క్రితం భర్త అమిత్ కు ఓ వాట్సాప్ వీడియో వచ్చింది. చూసిన అమిత్ షాక్ కు గురయ్యాడు. వీడియోలో తన భార్య రెండో పెళ్లి చేసుకుందని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. మొదటి పెళ్లి చేసుకున్న ఆర్య సమాజ్ లోనే రెండో పెళ్లి చేసుకుంది. దీంతో 2021 ఏప్రిల్ నెలలో రెండో పెళ్లి చేసుకుందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రుచివర్మ తన అత్తగారింట్లోనే ఉండి రెండో పెళ్లి చేసుకుందని, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. తన బంగారు నగలు, నగదు దోచుకెళ్లిపోయిందని తెలిపాడు. రెండు పెళ్లిళ్లు ఒకే చోట ఎలా చేశారు? ఆమె ఎందుకు ఇలా చేసింది అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.