HomeజాతీయంChandrayaan 3 vs Chandrayaan 2 : చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిలైంది.. చంద్రయాన్ 3...

Chandrayaan 3 vs Chandrayaan 2 : చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిలైంది.. చంద్రయాన్ 3 ఎందుకు సక్సెస్ అయ్యింది.. కారణాలివీ

Chandrayaan 3 vs Chandrayaan 2 : అది సెప్టెంబర్ 7, 2019. సమయం అర్థరాత్రి దాటింది. చంద్రయాన్_2 మిషన్ లో భాగంగా భూమి నుంచి 3.84 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. చంద్రుడి మీదికి ప్రవేశించిన ల్యాండర్ విక్రమ్. సరిగ్గా చంద్రుడి దక్షిణ ధృవం పైభాగాన్ని చేరుకుంది. ఆ సమయంలో చంద్రుడిపై సూర్యోదయం ప్రారంభమైంది. అయితే ఆ లేత వెలుగుల్లో విక్రమ్ లిక్విడ్ థ్రస్టర్ ఇంజన్లను మండించుకోవడం ద్వారా వేగాన్ని నియంత్రించుకుంటూ కిందికి దిగడం ప్రారంభించింది.. తర్వాత ఏమైందో తెలియదు కానీ దాని నుంచి సంకేతాలు ఆగిపోయాయి. శాస్త్రవేత్తల్లో ఒకటే ఆందోళన.. చివరికి వారి భయమే నిజమైంది. జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ లో విఫలమైన విక్రమ్ ల్యాండర్ చివరి క్షణాల్లో తలకిందులుగా పడిపోయింది.. దీంతో తమ కష్టం మొత్తం వృధా అయిందని ఇస్రో చైర్మన్ కంటతడి పెట్టుకున్నారు. ఆయనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఊరడించారు. ఇక అప్పటినుంచి అంటే దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఇస్రో చంద్రయాన్_3 మీద దృష్టి పెట్టింది. “చందమామతో ఒక మాట చెప్పాలి” అనుకుంటూ తీవ్రంగా శ్రమించి చంద్రయాన్_3 ని విజయవంతం చేసింది.

నాటి వైఫల్యాల నుంచి..

చంద్రయాన్_3 ప్రయోగం లో సాఫ్ట్ లాండింగ్ అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. దీనిని “20 మినిట్స్ ఆఫ్ టెర్రర్ ” శాస్త్రవేత్తలు పేర్కొంటారు. చంద్రయాన్_2 లో జరిగింది కూడా ఇదే. అయితే తాజా ప్రయోగంలో ఇది పునరావృతం కాకుండా ఇస్రో చాలా జాగ్రత్త పడింది. దీనికి సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకుంది. వీటి వల్లే ఆ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.

రఫ్ బ్రేకింగ్ దశ
లక్ష్యం: ల్యాండర్ వేగం తగ్గించడం
సమయం: 690 సెకన్లు

ఈ దశలో ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలానికి సమాంతరంగా ప్రయాణిస్తుంటుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ల్యాండర్‌ 7.4 కిలోమీటర్ల ఎత్తుకు, ల్యాండింగ్‌ ప్రదేశానికి 32 కిలోమీటర్ల దూరానికి (సమాంతరంగా) చేరుకుంటుంది. ల్యాండర్‌ వేగం గంటకు 6 వేల కిలోమీటర్ల నుంచి గంటకు 1,288.8 కిలోమీటర్లకు తగ్గుతుంది.

ఆల్టిట్యూడ్‌ హోల్డింగ్‌ ఫేజ్‌

లక్ష్యం: ల్యాండర్‌ వర్టికల్‌ వేగాన్ని తగ్గించడం, సమాంతరంగా ఉన్న ల్యాండర్‌ స్థితిని కొంతమేరకు నిలువుగా మార్చడం.

సమయం: 10 సెకన్లు

ఈ దశలో ల్యాండర్‌ సమాంతర వేగం గంటకు 1,288.8 కిలోమీటర్ల నుంచి 1,209.6 కిలోమీటర్లకు తగ్గుతుంది. వర్టికల్‌ వేగం గంటకు 219.6 కిలోమీటర్ల నుంచి 212.4 కిలోమీటర్లకు తగ్గుతుంది. ల్యాండర్‌ కూడా 7.4 కిలోమీటర్ల ఎత్తు నుంచి 6.8 కిలోమీటర్ల ఎత్తుకు దిగుతుంది. సమాంతరంగా ఉన్న ల్యాండర్‌ నిట్టనిలువు స్థితిలోకి రావడానికి వీలుగా తొలుత 50 డిగ్రీల మేర వంగుతుంది.

ఫైన్‌ బ్రేకింగ్‌ దశ

లక్ష్యం: ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు తేవడం

సమయం: 175 సెకన్లు

800 మీటర్ల ఎత్తుకు చేరకున్నాక అక్కడే 12 సెకన్లపాటు నిలిచి ఉంటుంది. ఈ దశలో.. చంద్రుడి ఉపరితలం నుంచి 6.8 కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్‌ 800 మీటర్ల ఎత్తుకు దిగుతుంది. ఆ సమయానికి.. దాని సమాంతర, వర్టికల్‌ వేగాలు సున్నాకు చేరుకుంటాయి. ల్యాండర్‌ 12 సెకన్లపాటు అక్కడే నిలిచి ఉంటుంది. దాని కోణం 50 డిగ్రీల నుంచి 90 డిగ్రీలకు మారుతుంది. ల్యాండర్‌ కాళ్లు చంద్రుడి దిక్కుకు తిరిగి.. దిగడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ సమయంలో ల్యాండర్‌లోని హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ ఎవాయిడెన్స్‌ కెమెరా పనిచేయడం ప్రారంభిస్తుంది. ల్యాండింగ్‌ లొకేషన్‌ను ఫొటో తీసి.. అక్కడ దిగడానికి సురక్షిత వాతావరణం ఉందా లేదా దాంట్లోని కృత్రిమ మేధ విశ్లేషిస్తుంది. మిగతా పరికరాల సమాచారం సాయంతో ల్యాండర్‌.. ల్యాండింగ్‌ సైట్‌ దిశగా కదులుతుంది.

టెర్మినల్‌ డిసెంట్‌ ఫేజ్‌-1

లక్ష్యం: సురక్షిత ల్యాండింగ్‌సైట్‌ను గుర్తించడం

సమయం: కిందికి దిగడానికి 131 సెకన్లు

చంద్రుడి ఉపరితలానికి 150 మీటర్ల ఎత్తుకు చేరాక అక్కడే 22 సెకన్లపాటు నిలిచి ఉంటుంది.

ఈ దశలో ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తు నుంచి 150 మీటర్ల ఎత్తుకు చేరాల్సి ఉంటుంది. చంద్రుడి గురుత్వబలం ల్యాండర్‌ను కిందకి లాగుతుంటే.. ల్యాండర్‌లోని గ్రౌండ్‌ ఫేసింగ్‌ రాకెట్లు అది వేగంగా కిందికి జారిపోకుండా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దాన్ని కిందికి దింపుతుంటాయి. 131 సెకన్ల తర్వాత ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలం నుంచి 150 మీటర్ల ఎత్తుకు చేరుతుంది. అక్కడ 22 సెకన్లపాటు నిలిచి ఉండగా.. దాంట్లోని పరికరాలు ల్యాండింగ్‌ ప్రదేశాన్ని గుర్తిస్తాయి.

టెర్మినల్‌ డిసెంట్‌ ఫేజ్‌ 2

లక్ష్యం: ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలం నుంచి 60 మీటర్ల ఎత్తుకు చేరుకోవడం.

సమయం: 52 సెకన్లు.

చంద్రుడి ఉపరితలానికి 150 మీటర్ల ఎత్తున ఉన్న ల్యాండర్‌.. ఈ దశలో 60 మీటర్ల ఎత్తుకు దిగుతుంది. దాంట్లోని కృత్రిమ మేధ పరికరాలు సురక్షితమైన ల్యాండింగ్‌ ప్రదేశాన్ని నిర్ధారిస్తాయి. అక్కడికి చేరుకోవడానికి ల్యాండర్‌ నెమ్మదిగా దిశ మార్చుకుంటుంది.

టెర్మినల్‌ డిసెంట్‌ ఫేజ్‌ 3
లక్ష్యం: సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ముందు దశ

సమయం: 38 సెకన్లు.

కృత్రిమ మేధ నిర్ధారించిన సురక్షిత ల్యాండింగ్‌ ప్రదేశంలో.. ల్యాండర్‌ గంటకు 4.7 కి.మీ. వేగంతో దిగడం ప్రారంభిస్తుంది. చంద్రుడి ఉపరితలానికి 60 మీటర్ల ఎత్తు నుంచి 10 మీటర్లకు జారుతుంది. ఆ దశలో ల్యాండర్‌లోని ఇంజన్లన్నీ షట్‌డౌన్‌ అవుతాయి.

టెర్మినల్‌ డిసెంట్‌ ఫేజ్‌ 4 (ఫ్రీఫాల్‌ దశ)

లక్ష్యం: ల్యాండర్‌ చంద్రుడిపై దిగడం.

సమయం: 9 సెకన్లు.

చంద్రుడి ఉపరితలానికి 10 మీటర్ల ఎత్తున ఉన్న ల్యాండర్‌లోని ఇంజన్లన్నీ షట్‌డౌన్‌ అవగానే.. చంద్రుడి గురుత్వశక్తి కారణంగా కిందికి జారడం మొదలుపెడుతుంది. దాని కాళ్లు చంద్రుణ్ని తాకగానే.. వాటిలో ఉండే సెన్సర్లు యాక్టివేట్‌ అవుతాయి. ల్యాండర్‌ చంద్రుడి మీద దిగిన 1.25 సెకన్లకు.. ఆ విషయం ఇస్రో గ్రౌండ్‌ కంట్రోల్‌కు తెలుస్తుంది.

..ఇక్కడితో ల్యాండర్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ విజయవంతమైనట్టు. అయితే, దీని తర్వాత ఇంకో దశ కూడా ఉంది. అది.. ల్యాండర్‌లోని రోవర్‌ బయటకు వచ్చి పరిశోధనలు చేసే దశ. కానీ అందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. కారణమేంటంటే.. 10 మీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్‌ కిందికి జారి పడినప్పుడు ఆ తాకిడికి పైకి లేచిన చంద్రధూళి సర్దుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది. అంతా సద్దుమణిగాక.. ల్యాండర్‌లోని రోవర్‌ బయటకు వస్తుంది. అప్పుడు ఆ రెండూ పరస్పరం ఫొటోలు తీసుకుని భూమికి పంపుతాయి. రెండూ సురక్షితంగా ఉన్నాయనడానికి ఆ ఫొటోలే నిదర్శనం. ప్రస్తుతం ఈ ఫోటోలనే ఇస్రో విడుదల చేసింది. ఈ ఫోటోల ఆధారంగానే ఇస్రో అధికారులు సంబరాలు జరుపుకున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version