spot_img
HomeజాతీయంWhatsapp : మీరు వాట్సాప్ వాడుతున్నారా? అయితే డేంజర్ లో ఉన్నట్టే?

Whatsapp : మీరు వాట్సాప్ వాడుతున్నారా? అయితే డేంజర్ లో ఉన్నట్టే?

Whatsapp : ఇప్పుడు వాట్సాప్ లేనిదే ఎవరికీ పూట గడవదు.. కొట్టుకోవడాలు అయినా.. తిట్టుకోవడాలు అయినా.. ముద్దులైనా.. ముచ్చట్లైనా.. మన పనులు.. బిల్ పేమంట్స్.. ఆఫీస్ వర్కులు పలకరింపులు అన్నింటికి వాట్సాప్ దిక్కు. మొన్నీ మధ్యన గంట ఆగిపోతేనే అంతా ఆగమాగమైన పరిస్థితి నెలకొంది. ఫేస్ బుక్ కు చెందిన ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఇప్పుడు అందరికీ నిత్యకృత్యమైంది.

అయితే తాజాగా వాట్సాప్ నుంచి భారీగా డేటా లీక్ కావడం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్ లైన్ లో విక్రయానికి ఉంచినట్లు తాజాగా సైబర్ న్యూస్ సంచలన నివేదిక బయటపెట్టింది. అమెరికా సహా పలు దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను హ్యాకర్లు అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. ఈ వార్త తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. తమ డేటా అంతా చోరీకి గురైందని.. రహస్యాలు, బ్యాంకింగ్ వ్యవహారాలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన చెందుతున్నారు.

48.7 కోట్ల వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లతో 2022 డేటాబేస్ ను విక్రయిస్తున్నట్టు ఓ హ్యాకర్ ఆన్ లైన్ లో ప్రకటన ఇవ్వడంతో ఈ భారీ హ్యాకింగ్ సంగతి బయటపడింది. అమెరికా, యూకే, ఈజిప్ట్, సౌదీ అరేబియా, సహా 84 దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను అమ్మకానికి పెట్టారు. ఇందులో భారత యూజర్లు కూడా ఉండడంతో అందరి డేటా ప్రమాదంలో పడిపోయింది.

అత్యధికంగా ఈజీప్ట్ నుంచి 4.5 కోట్ల మంది.. ఇటలీ 3.5 కోట్ల మంది అమెరికా నుంచి 3.2 కోట్ల మంది ఉన్నారు.ఒక్కో దేశానికి చెందిన యూజర్ల నంబరును ఒక్కో ధరతో విక్రయించారని తెలిసింది. ఈ నంబర్లను సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేసి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్ లు వస్తే స్పందించొద్దని సూచించింది.

ఇప్పటికే 50 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్ల డేటా మెటా నుంచి లీక్ అయ్యింది. ఇప్పుడు వాట్సాప్ డేటా కూడా గల్లంతు కావడంతో అందరూ తమ భద్రతకు ముప్పుగా అభివర్ణిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper
Exit mobile version