WhatsApp: వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తో అలరిస్తోంది. ఇప్పటివరకు ఎన్నో రకాల ఫీచర్లు అందించిన వాట్సాప్ తాజాగా వినియోగదారులను ఆకట్టుకునే రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్లతో కొన్ని అవసరాలు తీరడంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఫీల్ కావచ్చు. ముఖ్యంగా యూత్ ఫ్రెండ్స్ మధ్య చాటింగ్ జరిగే సమయంలో వెరీ ఫన్నీగా ఉండే ఛాన్స్ ఉందని వాట్సాప్ మాత్రం సంస్థ మెటా తెలిపింది. అసలు ఈ యాప్ లో వచ్చినా కొత్త ఫీచర్స్ ఏంటి? అవి ఎలా ఉపయోగపడతాయి?
ఇప్పటివరకు మనకు సాధారణ కాల్స్ చేసినప్పుడు మిస్డ్ కాల్స్ ఆప్షన్ ఉండేది. అంటే ఎదుటివారు అప్పటికే వేరే వారితో మాట్లాడుతున్నప్పుడు మనం కాల్ చేస్తే మిస్డ్ కాల్ చూపిస్తుంది. ఇదే ప్రక్రియ ఇప్పుడు వాట్సాప్ లో ప్రవేశపెట్టారు. అంటే వాట్సాప్ ద్వారా వీడియో కాల్ లేదా వాయిస్ కాల్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి బిజీగా ఉంటే.. మిస్డ్ call మెసేజ్ పంపొచ్చు. అంటే అవతల వ్యక్తి బిజీగా ఉన్నట్లు భావిస్తే అతనికి ఒక వాయిస్ నోట్ లేదా.. వీడియో నోట్ nu తయారు చేయడానికి కొత్త ఆప్షన్ వచ్చింది. ఇలా వాయిస్ లేదా వీడియో ద్వారా వారికి సందేశం పంపిస్తే ఎదుటివారు అర్థం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి బిజీగా ఉంటే పదేపదే కాల్స్ చేసే విసిగించాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ ఫీచర్ కమ్యూనికేషన్స్ బలపడడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఒక్కోసారి వాయిస్ లేదా వీడియో చాట్ పంపించకుండా చీర్ అనే మెసేజ్ తో మన పరిస్థితిని ఎదుటివారికి తెలుపవచ్చు. గ్రూప్ కాల్ చేసే వారికి కూడా ఇది వర్తిస్తుంది.
ఇప్పటివరకు వాట్స్అప్ మెసేజ్ టెక్స్ట్ లేదా ఇమేజ్, వీడియో ద్వారా రియాక్షన్ పంపేవారు. కానీ ఇప్పుడు AI ఇమేజ్ క్రియేషన్ చేసి పంపించుకోవచ్చు. దీనిని plux, మిడ్జౌర్నీ అని అంటారు. వీటి ద్వారా మెసేజ్ చేసి ఎదుటివారిని ఇంట్రెస్ట్ చేయవచ్చు. అలాగే డెస్క్ టాప్ లో వాట్సాప్ వినియోగదారుల కోసం కొత్త మీడియా టాబ్ nu ఏర్పాటు చేసింది. ఇందులో డాక్యుమెంట్స్, లింక్స్, మీడియాను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అలాగే యానిమేషన్ వీడియో క్రియేట్ చేయడానికి కూడా ఆప్షన్లు రాబోతున్నాయి.
త్వరలో న్యూ ఇయర్ తో పాటు సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో మెటా సంస్థ ఈ కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తే మెసేజ్ చేయడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఫెస్టివల్ కు సంబంధించిన స్టిక్కర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.