Harnaaz Sandhu: విశ్వ వేదికపై భారత్ మరోసారి సత్తాచాటింది. శక్తి సామర్థ్యాల్లో తనకు ఎదురులేదని ఎప్పటికప్పుడు ప్రపంచానికి చాటుతున్న భారత్ అందంలోనూ ఎవరికీ తీసిపోమని నిరూపిస్తోంది. తాజాగా విశ్వ సుందరి పోటీల్లో 80దేశాల యువతులకు భారత వనిత హర్నజ్ కౌర్ సిందు గట్టిపోటీ ఇచ్చి విశ్వసుందరి కీరిటాన్ని దక్కించుకున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఆమె ప్రశంసలు కురిపిస్తున్నారు.
పంజాబీ రాష్ట్రంలోని చండీగడ్ కు చెందిన హర్నాజ్ కౌర్ సంధు(21) విశ్వసుందరి కిరీటాన్ని గెలువడం వెనుక ఎంతో కరోఠ శ్రమ దాగివుంది. అనేక అవమానాలను ఎదుర్కొని చివరికీ అనుకున్నది సాధించారు. హర్నాజ్ కు చిన్నతనం నుంచే మోడలింగ్ ఇష్టం. నటిగా వెండితెరపై రాణించాలని ఎన్నో కలలను కంది.
ఆ కలలను నిజం చేసుకునేందుకు విద్యార్థి దశ నుంచే మోడలింగ్ శిక్షణ తీసుకుంది. ఈక్రమంలోనే ‘లివా మిస్ దివా యూనివర్స్’ కిరిటాన్ని దక్కించుకొని సత్తా చాటింది.తనకు అందివచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంది.
80దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి విశ్వసుందరి కీరటాన్ని సంపాదించుకుంది. భారత్ కు 21ఏళ్ల తర్వాత 21ఏళ్ల హర్నాజ్ కౌర్ సందు మిస్ యూనివర్స్ కిరిటీని అందించింది. అమ్మ ప్రోత్సాహంతోనే తాను ఈస్థాయికి ఎదగాలని హర్నాజ్ కౌర్ చెబుతోంది.
ఇక తన టీనేజీలో శారీరాకృతి విషయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కోన్నానని అవన్నీ కూడా తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని పేర్కొంది. యువత ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదైనా సాధించవచ్చని హర్నాజ్ కౌర్ చెబుతోంది. తాను మిస్ యూవవర్సిటీ కిరిటం గెలవడానికి తనలోని ఆత్మవిశ్వాసమే కారణమని హర్నాజ్ కౌర్ స్పష్టం చేసింది.
Also Read: వెంకీ కెరీర్ లోనే భారీ రికార్డ్ క్రియేట్ చేసింది !
హర్నాజ్ కౌర్ సందు ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ చేస్తోంది. మోడలింగ్ మాత్రమే కాకుండా పలు సినిమాల్లోనూ హర్నాజ్ కౌర్ నటించింది. ఫిట్ నెస్ ను కాపాడుకునేందుకు గుర్రపు స్వారీ, సిమ్మింగ్, యెగా వంటివి చేస్తోంది. డాన్స్ లోనూ ఆ అమ్మడు సూపరే.
2014 ఫిబ్రవరి 14న ఇన్ స్ట్రాగ్రాములో చేరిన హర్నాజ్ కు 73లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్రావెలింగ్, స్నేహితులతో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడే హర్నాజ్ ఖాళీ సమయంలో వంట కూడా చేస్తుంది. మొత్తానికి హర్నాజ్ కౌర్ సంధు అందంలోనే కాకుండా అన్ని పనుల్లో నైపుణ్యం సాధించి ఆల్ రౌండర్ అనిపించుకుంటోంది.
Also Read: టాలీవుడ్ భల్లాల దేవ రానా పుట్టినరోజు నేడు.. ఆయన సినీకెరీర్పై ప్రత్యేక కథనం