Homeఎంటర్టైన్మెంట్Sai Dharam Tej: వరుసగా కథలకు ఓకే చెప్తున్న సాయితేజ్​.. షూటింగ్ ఎప్పటినుంచంటే?

Sai Dharam Tej: వరుసగా కథలకు ఓకే చెప్తున్న సాయితేజ్​.. షూటింగ్ ఎప్పటినుంచంటే?

Sai Dharam Tej: మెగాస్టార్ మెనల్లుడు సాయి ధరమ్ తేజ్​ ఇటీవలే ఓ బైక్​ యాక్సిడెంట్​లో గాయపడిన విషయం తెలిసిందే. దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్స్​ దగ్గర బైక్​ స్కిడ్​ అయ్యి కింద పడ్డారు సాయిధరమ్​. దీంతో తేజ్​కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించి.. పెను ప్రమాదం నుంచి తప్పించారు. నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న తేజ్​.. ఇటీవలే దీపావళి రోజు డిశ్చార్జ్​ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు.

Sai Dharam Tej

అయితే, షూటింగ్ పరంగా ఇంకా కాస్త తన శరీరం సహకరించే విధంగా లేదని తెలుస్తోంది. ఇంకొద్ది రోజులు సాయి తేజ్​ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని.. మళ్లీ గతంలో లాగ ఫుల్​ యాక్టీవ్​ అయ్యాగే సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. అందుకోసం తన బాడీని ట్రైన్​ చేయడం కూడా మొదలుపెట్టాశాడట. మంచి ఆహారంతోపాటు, జిమ్​, యోగా చేయడం లాంటివి కూాడా చేస్తున్నాడట.

చిరు మేనల్లుడిగా వెండితెరపై అడుగుపెట్టి.. పిల్లా నువ్వులేని జివితం సినిమాతో హిట్​ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన రిపబ్లిక్​ సినిమాకు బాస్కాఫీసు వద్ద మంచి స్పందన లభించింది. అయితే, కలెక్షన్ల పరంగా ఆశించిన స్థాయిలో రాబట్టుకోలేకపోయింది. కాగా, ఈ సినిమాకు దేవకట్ట దర్శకత్వం వహించారు. కాగా, ఈ గ్యాప్​లో వరుసగా కథలు వింటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మారుతితో పాటు మరో కొత్త దర్శకుడికి ఓకే చెప్పినట్లు సమాచారం. మారుతి సినిమాను జనవరిలో పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇలా కొత్త సంవత్సరాన్ని కొత్త సినిమా అనౌన్స్​మెంట్లతో స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version