HomeజాతీయంChandrayaan 3 : మూన్‌పై మన న్యూస్ రీడర్లు.. రిపోర్టర్లు.. చంద్రయాన్‌–3 కన్నా ముందే దూసుకెళ్లారు!!

Chandrayaan 3 : మూన్‌పై మన న్యూస్ రీడర్లు.. రిపోర్టర్లు.. చంద్రయాన్‌–3 కన్నా ముందే దూసుకెళ్లారు!!

Chandrayaan 3 : ఎంటీ.. శీర్షికలో ఏదో తేడా కొడుతోంది అనుకుంటున్నారా.. భారతీయ టీవీ చానెళ్లు తేడాగా న్యూస్‌ కవర్‌ చేస్తున్నాయి. అందుకే శీర్షికను కూడా తేడాగా పెట్టాం.. గంతే.. విషయం ఏమిటంటే చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో చంద్రయాన్‌ – 3ని ప్రయోగించింది. అందులోని విక్రమ్‌ ల్యాండర్‌ సేఫ్‌ ల్యాండింగ్‌పై ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతుండగా టీవీ చానెళ్ల న్యూస్‌ రీడర్స్, రిపోర్టర్లు మాత్రం విక్రమ్‌ రోవడ్‌ కంటే ముందే ల్యాండ్‌ అయ్యారు. అదేంటి అంటే.. తాము చందమామపై నుంచే న్యూస్‌ చదువుతున్నట్లు, రిపోర్టింగ్‌ చేస్తున్నట్లు గ్రాఫిక్స్‌ చేసి ప్రసారం చేస్తున్నారు. దీంతో న్యూస్‌ చానెళ్లు చూస్తున్నవారు ముక్కున వేలేసుకుంటున్నారు.

సూపర్బ్‌.. న్యూస్‌ చానెల్స్‌.. జెట్‌ కన్నా స్పీడ్‌గా..
వకీల్‌సాబ్‌ సినిమాలో ఎస్సై ఇన్సిడెంట్‌ స్పాట్‌కు జెట్‌ స్పీడ్‌లో వెళ్లానని కోర్టులో లాయర్‌(పవన్‌ కళ్యాణ్‌) అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతుంది. దానికి సూపర్‌ ఉమెన్‌ అంటారు పవన్‌.. ఇప్పుడు న్యూస్‌ చానెళ్లు సూపర్‌ ఉమెన్‌ కంటే వేగంగా.. కాదు కాదు.. జెట్‌ స్పీడ్‌ కన్నా వేగంగా.. ఇంకా చెప్పాలంటే.. జూలై 23న ప్రయోగించిన చంద్రయాన్‌ – 3 కన్నా స్పీడ్‌గా మన టీవీ చానెళ్ల రిపోర్టర్లు, న్యూస్‌ రీడర్లు చేరిపోయి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. చంద్రయాన్‌ – సేఫ్‌ల్యాండింగ్‌ ఒక అద్భుతమైతే.. న్యూస్‌ రీడర్స్, రిపోర్టర్స్‌ ల్యాండింగ్‌ మరో అద్భుతమనే అనాలి. గ్రాఫిక్స్‌ ఉన్నాయి కదా అని ఇష్టం ఉన్నట్లు వాడేసుకుంటున్నారు మరి.

43 రోజుల ప్రయాణం..
ఇదిలా ఉంటే చంద్రునుపై అడుగు పెట్టాలన్న భారత సంకల్పం మరికొన్ని గంటల్లో నెరవేరబోతోంది. జూలై 15న ప్రయోగించిన చంద్రాయన్‌ – 3 43 రోజుల ప్రయాణం తర్వాత చంద్రమామపై సేఫ్‌ లాండింగ్‌ కోసం శాస్త్రవేత్తలు అహర్నిషలు శ్రమిస్తున్నారు. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల తర్వాత రోవర్‌ విక్రమ్‌ చందమామపై ల్యాండ్‌ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. బెంగళూర్‌లోని కంట్రోల్‌ స్టేషన్‌ నుంచి విక్రమ్‌ను ఆపరేటింగ్‌ చేస్తున్నారు. విక్రమ్‌ ల్యాండింగ్‌ను విద్యార్థులు వీక్షించేలా ఇస్రో అవకాశం కల్పించింది.

25 కిలో మీటర్ల దూరంలో..
ప్రస్తుతం విక్రమ్‌ ల్యాండ్‌ చందమామకు కేవలం 25 కిలో మీటర్ల దూరంలో ఉంది. సెకనుకు 336 మీటర్ల వేగంతో కదులుతున్న విక్రమ్‌ సాయంత్రం 5 గంటల వరకు ఇంకా దగ్గరగా చేరనుంది. 7.4 కిలోమీటర్ల దగ్గరకు చేరిన తర్వాత 6.4 కిమీ వరకు సెకనుకు 334 వేగం తగ్గిస్తారు. 800 మీటర్ల ఎత్తు నుంచి 150 మీటర్ల ఎత్తు వరకు వేగాన్ని సెకనుకు 60 మీటర్లకు తగ్గిస్తారు. ఇక 60 నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు చేరడానికి వేగాన్ని సెకనుకు 45 మీటర్లకు తగ్గిస్తారు. చివరగా 10 మీటర్ల నుంచి చంద్రునిపై ల్యాండ్‌ అయ్యే వరకు విక్రమ్‌ వేగాన్ని సెకనుకు 1.5 మీటర్లకు తగ్గిస్తారు. ఈ ప్రక్రియ సాయంత్ర 5 గంటల తర్వాత జరుగుతుంది.

Chadrayaan3 Landing Updates: एक बार फिर चांद पर इसरो नया इतिहास रचने से बस एक कदम दूर! | ISRO

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version