https://oktelugu.com/

Ram Mandir: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

అయోధ్యకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని, ఖర్చుకు వెనుకాడడం లేదని ఈజ్‌ మై ట్రిప్, థామస్‌ కుక్, ఎస్‌ఓటీసీ తదితర ట్రావెల్‌ సంస్థలు తెలిపాయి.

Written By: , Updated On : January 17, 2024 / 02:07 PM IST
Ram Mandir

Ram Mandir

Follow us on

Ram Mandir: అయోధ్య సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు పుట్టిన పుణ్యభూమి. ఆ మహాపురుషుడు పుట్టిన దేశంలో మనం పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం. వందల ఏళ్ల చరిత్ర ఉన్న అయోధ్యలో అభినవ రామమందిర నిర్మాణం పూర్తి కావస్తోంది. జనవరి 22న ఆలయంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా నిర్వహించే ఈ వేడుకను చూసేందుకు ఇప్పటికే వేల మందికి ఆహ్వానాలు అందాయి. వీవీఐపీలు, వీఐపీలతోపాటు సామాన్య భక్తులకు కూడా ఆహ్వాన లేఖలు అందడంతో చాలా మంది జనవరి 22 నాటికి అయోధ్య వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొందరు. విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్య వెళ్లాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యకు ఎలా వెళ్లాలి. ఎంత ఖర్చవుతుంది.. అక్కడ బస చేసేందుకు ఉన్న వసతులు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.

ఖర్చుకు వెనుకాడకుండా..
అయోధ్యకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని, ఖర్చుకు వెనుకాడడం లేదని ఈజ్‌ మై ట్రిప్, థామస్‌ కుక్, ఎస్‌ఓటీసీ తదితర ట్రావెల్‌ సంస్థలు తెలిపాయి. ఏడు వేల మందికి మాత్రమే జనవరి 22న నిర్వహించే ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి. ఈ నేపథ్యంలో తర్వాతి రోజు కూడా వెళ్లేందుకే వేలాది మంది ఎదురు చూస్తున్నారు. ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుంచి అయోధ్యకు విమాన టికెట్ల ధరలు పెరిగాయి. రూ.20 వేల నుంచి రూ.30 వేలకు చేరుకున్నాయి. ఇతర సమయాల్లో ఉన్న ధరకంటే రెట్టింపు స్థాయిలో చార్జీలు పెంచేశాయి. మేక్‌ మై ట్రిప్‌ ట్రావెల్‌ సంస్థ అయోధ్య వెళ్లడానికి విమాన టికెట్‌ ధర రూ.17,900 నుంచి రూ.24,600 వసూలు చేస్తోంది. జనవరి 21 నాటికి నాన్‌స్టాప్‌ విమానాల ధర రూ.20,699గా ఉంది. జనవరి 20న కోల్‌కతా నుంచి అయోధ్యకు విమాన టికెట్ల ధర రూ.18,456 నుంచి రూ.25,761గా ఉంది. బెంగళూరు నుంచి అయోధ్యకు జనవరి 20న రూ.23,152 నుంచి రూ.32,855 వరకు విమాన టికెట్ల ధర ఉంది. ఇదిలా ఉండగా, ఈనెల 22 తర్వాత నిత్యం మూడు నుంచి ఐదు లక్షల మంది అయోధ్యకు వస్తారని అంచనా వేస్తున్నారు.

వసతి ఇలా..
రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలోని హోటళ్లన్నీ ఇప్పటికే బుక్‌ అయిపోయాయి. హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ రేటు 80 నుంచి 100 శాతానికి చేరుకుంది. దీంతో కొన్ని హోటళ్లలో రాత్రిపూట గది అద్దె ధర రూ.70 వేలు వరకూ చెబుతున్నారు. అందుకే అయోధ్యకు వచ్చే చాలామంది భక్తులు పగటిపూట అయోధ్యలో ఉంటూ, రాత్రి లక్నో లేదా ప్రయాగ్‌రాజ్‌లో బస చేసేందుకు ప్లాన్‌ చేసుకోవడం మంచిదంటున్నారు.