https://oktelugu.com/

Father kills son: వైరల్ వీడియో: కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి

Father kills son  మానవత్వం మంటగలుస్తోంది. సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోతోంది. కన్న కొడుకును ఆస్తి కోసం హతమార్చిన కసాయి తండ్రి ఉదంతం విస్తుగొలుపుతోంది.కేవలం ఆస్తి లెక్కలు చెప్పలేదన్న కారణంతో కొడుకుపై పెట్రోల్ పోసి చంపిన వైనం షాకింగ్ గా మారింది. బెంగళూరులో ఈ దారుణం వెలుగుచూసింది. బెంగళూరులో ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. బిజినెస్ లో రూ.1.5 కోట్ల లావాదేవీల వివరాలను తనకు చెప్పలేదన్న కోపంతో తండ్రి సురేంద్ర నడిరోడ్డుపై కుమారుడు అర్పిత్ పై […]

Written By:
  • NARESH
  • , Updated On : April 7, 2022 / 07:41 PM IST
    Follow us on

    Father kills son  మానవత్వం మంటగలుస్తోంది. సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోతోంది. కన్న కొడుకును ఆస్తి కోసం హతమార్చిన కసాయి తండ్రి ఉదంతం విస్తుగొలుపుతోంది.కేవలం ఆస్తి లెక్కలు చెప్పలేదన్న కారణంతో కొడుకుపై పెట్రోల్ పోసి చంపిన వైనం షాకింగ్ గా మారింది. బెంగళూరులో ఈ దారుణం వెలుగుచూసింది.

    బెంగళూరులో ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. బిజినెస్ లో రూ.1.5 కోట్ల లావాదేవీల వివరాలను తనకు చెప్పలేదన్న కోపంతో తండ్రి సురేంద్ర నడిరోడ్డుపై కుమారుడు అర్పిత్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలుతూ అతడు పరుగులు తీశాడు. ఈ వీడియో సమీప సీసీటీవీలో రికార్డు కావడంతో అది చూసి అందరూ విస్తుపోతున్నారు. తండ్రి ఇంత దారుణానికి పాల్పడుతున్న పాపం ఆ కుమారుడు ఏం అనకుండా సముదాయించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. కానీ ఆ కసాయి తండ్రి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

    తండ్రి నిప్పంటించడంతో ఆయనను ఏమీ అనలేక.. ఆ కొడుకు ఆయనకు దూరంగా పరిగెత్తడం కనిపించింది. ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు తీసిన వైనం అందరినీ షాక్ కు గురిచేసింది.

    మంటల్లో కాలిపోతున్న అతడిని స్థానికులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. కానీ అతడి ప్రాణాలు నిలవలేదు. చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. 1.5 కోట్ల లావాదేవీల వివరాలు చెప్పలేదని కన్న కొడుకును చంపిన ఆ కసాయి తండ్రిపై ఇప్పుడు అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

    Tags