Acharya Trailer: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆచార్య ట్రైలర్ రిలీజ్ డేట్ కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను మొదట ఫిబ్రవరి 2న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే, కరోనా నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేయడంతో.. ట్రైలర్ ను కూడా వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి టీమ్ ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే ఈ ట్రైలర్ ట్రీట్ ఉండబోతుంది. ఈ ట్రైలర్ లో భారీ విజువల్స్, అలాగే చరణ్ – చిరు మీదఎమోషనల్ సీన్స్ కి సంబంధించిన మెయిన్ షాట్స్ , ముఖ్యంగా మెగాస్టార్ ఎలివేషన్ షాట్స్.. ఇక దేవాలయాల పై చిరు చెప్పే డైలాగ్, అదే విధంగా చిరు – చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించినప్పుడు ఇద్దరి మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతాయట.
కాగా ఈ ట్రైలర్ ను ఈ నెల 20న రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి మెగా అభిమానులను హ్యాపీ చేయడానికి కొరటాల బాగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
పైగా ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రతి సీన్ విషయంలో చిరు ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు.

అన్నట్టు ఆచార్యలో చరణ్ పాత్ర ఎంతసేపు ఉంటుంది ? ఆచార్యలో చరణ్ పాత్ర నిడివి సుమారు 24 నిమిషాలు ఉండబోతుంది. చిరు – చరణ్ మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్ అందిస్తాయట. ఏప్రిల్ 29న సమ్మర్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం రన్ టైం సుమారు 2 గంటల 58 నిమిషాలు ఉండేలా కొరటాల ప్లాన్ చేశాడు.
[…] […]
[…] Pawan kalyan- Harish Shankar Movie: పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. పైగా చేసిన రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఈ రెండూ కూడా రీమేక్ సినిమాలే అయినా బంపర్ హిట్ కొట్టాయి. దీంతో పవన్ కళ్యాన్ ఫుల్ జోష్ లో తాను ఒప్పుకున్న మిగతా సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గతంలో కంటే చాలా వేగంగా సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నారు. […]