https://oktelugu.com/

Viral Toxic Fever: ప్రజలపై ఓవైపు కరోనా.. మరోవైపు వైరల్ ఫీవర్..

Viral Toxic Fever: దేశంలో విషజ్వరాల కాలం వచ్చేసింది. వర్షాకాలంలో వ్యాధులు విజృంభించే అవకాశాలు ఎక్కువ. దీంతో ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అందరు ఆస్పత్రుల పాలు అయ్యే కాలం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నా వ్యాధుల బారి నుంచి తప్పించుకోవడం లేదు. ఫలితంగా ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఫలితంగా ప్రజల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కరోనా మూడో ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 29, 2021 5:07 pm
    Follow us on

    Viral Toxic Fever

    Viral Toxic Fever: దేశంలో విషజ్వరాల కాలం వచ్చేసింది. వర్షాకాలంలో వ్యాధులు విజృంభించే అవకాశాలు ఎక్కువ. దీంతో ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అందరు ఆస్పత్రుల పాలు అయ్యే కాలం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నా వ్యాధుల బారి నుంచి తప్పించుకోవడం లేదు. ఫలితంగా ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఫలితంగా ప్రజల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కరోనా మూడో ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై సర్కారు నిర్ణయం తీసుకోవడంతో పిల్లల భవితవ్యం ఏమిటన్నది అర్థం కాని ప్రశ్నే.

    విష జ్వరాలు విజృంభించే తరుణంలో కరోనాతో పాటు మలేరియా, డెంగీ లాంటి వ్యాధులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత ఏడాది వైరల్ జ్వరాల జాడ కనిపించలేదు. కానీ ప్రస్తుతం విషజ్వరాల దాడి ఎక్కువగా ఉంటోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వైరల్ ఫీవర్ల దాడి పెరుగుతోంది. ఫలితంగా ప్రజలు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. క్షేత్రస్థాయిలో వైరల్ ఫీవర్ల విజృంభన పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికి ఏ చర్యలు తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. కరోనా మూడో ముప్పు పొంచి ఉన్న సందర్భంలో ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దోమల దాడితో వ్యాధులు పెరుగుతున్నాయి.

    దోమల వృద్ధి పెరగడంతో వ్యాధులు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో వ్యాధుల తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలో 50 వరకు మరణాలు సంభవించాయని సమాచారం. ఇందులో 26 మంది చిన్నారులున్నారు. కరోనా వ్యాధి మాదిరిగానే జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, శ్వాస కోశ సమస్యలు వస్తున్నాయి. దీంతో కరోనాకు వాటికి తేడా తెలియడం లేదు. ఒక్క వాసన తప్ప.

    మలేరియా, టైఫాయిడ్, డెంగీ విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. కరోనాతో బాధపడుతుంటే ఇప్పుడు విషజ్వరాల ప్రభావం ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నా వ్యాధుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. వైరల్ ఫీవర్ల నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం గుర్తించాలని ప్రభుత్వం సూచిస్తోంది.