
తెలంగాణ బీజేపీ అడ్డా అని బీజేపీ నేత బండి సంజయ్ స్పష్టం చేశారు. 2023 గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక భాగ్యలక్ష్మీ ఆలయం దగ్గర మొదటి బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజా సంగ్రామ యాత్రకు భారీగా తరలివస్తున్న భాగ్యనగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.