Balakrishna vs JrNTR: నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR) ఏకాకి అయ్యారని ఒక ప్రచారం ఉంది. ఆయనకు మద్దతుగా నిలవడం వల్ల కళ్యాణ్ రామ్ సైతం దూరం పెట్టారని పెద్ద ఎత్తున టాక్ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆది నుంచి ఇలానే జరుగుతోంది. అయితే చంద్రబాబుతో పాటు బాలకృష్ణ తారక్ కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే నందమూరి హరికృష్ణ మరణం తర్వాత పరిస్థితి మారింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు తో పాటు ఆయన కుటుంబాన్ని జగన్ టార్గెట్ చేశారు. ముఖ్యంగా వైసీపీలోనే జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులుగా పేరుపొందిన కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ ద్వారా చంద్రబాబుకు అనేక రకాలుగా అవమానించారు జగన్. ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా రియాక్ట్ కాలేదు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కనీసం స్పందించలేదు. సానుభూతి తెలపలేదు. అందుకే వారి మధ్య విపరీతమైన గ్యాప్ పెరిగింది. ముఖ్యంగా బాలకృష్ణ తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ ను దూరం పెట్టడం ప్రారంభించారు.
Also Read: హృతిక్ రోషన్ హిస్టరీ గురించి ఎన్టీఆర్ కి తెలియదా..? అలా ఎలా నోరు జారాడు?
నన్ను టచ్ చేయలేరు అంటూ కామెంట్..
నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) చాలా సందర్భాల్లో డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పట్లో టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును అప్పటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గానీ.. కళ్యాణ్ రామ్ కానీ స్పందించలేదు. అప్పట్లో నందమూరి కుటుంబం అంతా ఏకతాటి పైకి వచ్చి చంద్రబాబుకు అండగా నిలిచింది. అప్పట్లోనే బాలకృష్ణ డోంట్ కేర్ అంటూ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం తనను టచ్ చేయలేరు అంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఆయన నటించిన వార్ 2 చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యాఖ్య చేశారు. అయితే ఇది నందమూరి బాలకృష్ణకు ఉద్దేశించి చేసిన దేనన్న అనుమానాలు ఉన్నాయి.
Also Read: మెగాస్టార్ చిరంజీవి ని ఎన్టీఆర్ మర్చిపోవడం విడ్డూరంగా ఉంది..ఇదెక్కడి న్యాయం ?
రజిని చిత్రానికి శుభాకాంక్షలు..
జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాతో పాటు రజనీకాంత్ కూలి సినిమా విడుదలవుతోంది. అయితే ఏపీ మంత్రి నారా లోకేష్( Nara Lokesh ) మాత్రం రజనీకాంత్ తో పాటు కూలి సినిమా యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో లైట్ తీసుకున్నారు. అయితే రజనీకాంత్ అప్పట్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. చంద్రబాబు అరెస్టు సమయంలో స్పందించారు. అందుకు కృతజ్ఞత గానే లోకేష్ కూలి సినిమాకు విషెస్ చెప్పినట్లు తెలుస్తోంది. తద్వారా జూనియర్ ఎన్టీఆర్కు గట్టి సంకేతాలే ఇచ్చారు. వార్ 2 సినిమాకు తమ మద్దతు లేదు అని తేల్చేశారు. ఒకవైపు నందమూరి బాలకృష్ణ సైతం తన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయనకు నందమూరి ఫ్యామిలీ అండగా నిలుస్తోంది. దగ్గుబాటి పురందేశ్వరి సైతం ఆశీర్వదిస్తున్నారు. రక్షాబంధన్ నాడు రాఖీ కట్టి ఆశీర్వదించారు కూడా. అయితే ఈ మొత్తం పరిణామాలను చూస్తుంటే మాత్రం.. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబంలో ఏకాకి అయినట్టే. అయితే తన తల్లికి అవమానం, తన తండ్రి జైలు పాలు అయినప్పుడు కనీసం స్పందించని తారక్ విషయంలో.. లోకేష్ గట్టిగానే దెబ్బతీశాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.