Varanasi: మోడీ రాకతో కాషాయమయంగా మారిన ‘వారణాశి’..!

Varanasi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గమైన వారణాశిలో ఈరోజు పర్యటించారు. మోదీ పర్యటన నేపథ్యంలో వారణాశి ప్రాంతమంతా కషాయమయంగా మారిపోయింది. మోడీ డ్రీమ్ ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మోదీ నేటి ఉదయమే వారణాశికి చేరుకోగా స్థానికులు ఆయన ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా పూలచల్లుతూ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా హరహర మహదేవ్.. శంభో శంకర నినాదాలతో మార్మోగిపోయింది. కారిడార్‌ ప్రారంభానికి ముందుగా ప్రధాని మోదీ గంగానదీలో పుణ్యస్నానాన్ని ఆచరించారు. […]

Written By: NARESH, Updated On : December 14, 2021 10:57 am
Follow us on

Varanasi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గమైన వారణాశిలో ఈరోజు పర్యటించారు. మోదీ పర్యటన నేపథ్యంలో వారణాశి ప్రాంతమంతా కషాయమయంగా మారిపోయింది. మోడీ డ్రీమ్ ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మోదీ నేటి ఉదయమే వారణాశికి చేరుకోగా స్థానికులు ఆయన ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా పూలచల్లుతూ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా హరహర మహదేవ్.. శంభో శంకర నినాదాలతో మార్మోగిపోయింది.

Narendra Modi

కారిడార్‌ ప్రారంభానికి ముందుగా ప్రధాని మోదీ గంగానదీలో పుణ్యస్నానాన్ని ఆచరించారు. ఆ తర్వాత అక్కడి ఆలయాలను సందర్శించారు. కాలభైరవేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లలిత ఘాట్ వద్ద గంగానదికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రధాన ఆలయం కాశీ విశ్వనాథుడిని మోడీ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారణాశిలో మరే ఇతర ప్రభుత్వం లేదని..  ఆ కాశీ విశ్వనాథుడే పరిపాలకుడన్నారు. తామంతా ఆయన సేవకులమేనని చెప్పుకొచ్చారు. వారణాశి ప్రాచీన వైభోగాన్ని చెక్కు చెదరనివ్వకుండా, అత్యంత అధునాతనంగా ఈ కారిడార్ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దామని ప్రధాని తెలిపారు.

339 కోట్ల రూపాయలపైగా ఈ కారిడార్ కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. నిర్దేశిత గడువులోగా దీనిని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కొనియాడారు. అనంతరం ప్రధాని ఘాట్ వద్ద కార్మికులను కలుసుకున్నారు.

నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్మికులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు.

Also Read: సీఎం కేసీఆర్ ‘భక్తి’ రాజకీయం చేయబోతున్నారా?

తొలుత భోజ్‌పురిలో మోడీ క్లుప్తంగా మాట్లాడారు. పురాణాలు, చరిత్రలో వారణాశికి ఉన్న ప్రాముఖ్యతను వర్ణించడానికి మాటలు చాలవన్నారు. ఛత్రపతి శివాజీ మొదలుకుని ఝాన్సీ లక్ష్మీబాయి దాకా.. మున్షీ ప్రేమ్‌చంద్ మొదలుకుని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వరకూ ఎందరో చరిత్రకారులతో ఈ నగరం ముడిపడి ఉందన్నారు.

శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న కాశీ నగరం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని తెలిపారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, నమామి గంగేకు కూడా ప్రాధాన్యత ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. మొత్తానికి మోడీతో వారణాసిలో పండుగ వాతారణం నెలకొంది.

Also Read: నిజమైన స్నేహితులలో ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉంటాయి.. ఏవంటే?