కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లను ఇవ్వడానికి సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఎస్సీ కులానికి చెందిన విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఉన్న స్కీమ్ కు ఆమోదం తెలిపింది. ఎస్సీ విద్యార్థులు ఉన్నత విద్యను చదివేందుకు వీలుగా స్కాలర్ షిప్ మొత్తాన్ని ఏకంగా ఐదు రెట్లు పెంచింది. కేంద్రం రాబోయే ఐదేళ్లలో 59 వేల కోట్ల రూపాయలు 4 కోట్ల మంది విద్యార్థుల స్కాలర్ షిప్ కోసం ఖర్చు చేయనుంది.
Also Read: రాష్ట్రపతి భవన్‌కు కాలినడకన రాహుల్
ఈ 59 వేల కోట్ల రూపాయలలో కేంద్రం 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుండగా మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ విద్యార్థుల కోసం ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం నిధులను కేటాయించాల్సి ఉంటుంది. మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ మంత్రివర్గ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
Also Read: డేంజర్: వెలుగుచూసిన మరో రకం కరోనా
ప్రస్తుతం దేశంలో కమిటెడ్ లయబిలిటీ అనే స్కీమ్ అమలవుతోందని ఆ స్కీమ్ కు బదులుగా కొత్త స్కీమ్ ను అమలులోకి తీసుకొస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ నుంచి విద్యార్థులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా నిరుపేద ఎస్సీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చదివి ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
కేంద్ర కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయంతో పాటు కేబినేట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కేంద్రం డీటీహెచ్ సర్వీసులకు సంబంధించిన నిబంధనలలో సైతం కీలక మార్పులు చేసింది. లైసెస్న్ ఫీజును మూడు నెలలకు ఒకసారి చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర కేబినేట్ తెలిపింది. కేంద్ర కేబినేట్ ఈ నెల 25వ తేదీన రైతుల ఖాతాలలో కేంద్రం 2,000 రూపాయల చొప్పున జమ కానుందని వెల్లడించింది.