https://oktelugu.com/

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సులభంగా పేరు, అడ్రస్ మార్చుకునే ఛాన్స్..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఏ సంక్షేమ పథకానికి అర్హత పొందాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. అయితే ఆధార్ కార్డ్ లో తప్పులు ఉంటే మాత్రం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆధార్ కార్డులో ఒకలా, ఇతర ధృవపత్రాల్లో మరోలా పేర్లు ఉంటే కొన్నిసార్లు అర్హులైనా పథకాలను పొందలేక ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే యూఐడీఐఏ సులభంగా ఇంటినుంచే అడ్రస్, ఇతర వివరాలను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. Also Read: ఎన్నికల ఎఫెక్ట్.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 24, 2020 12:11 pm
    Follow us on

    Aadhaar Card
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఏ సంక్షేమ పథకానికి అర్హత పొందాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. అయితే ఆధార్ కార్డ్ లో తప్పులు ఉంటే మాత్రం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆధార్ కార్డులో ఒకలా, ఇతర ధృవపత్రాల్లో మరోలా పేర్లు ఉంటే కొన్నిసార్లు అర్హులైనా పథకాలను పొందలేక ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే యూఐడీఐఏ సులభంగా ఇంటినుంచే అడ్రస్, ఇతర వివరాలను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

    Also Read: ఎన్నికల ఎఫెక్ట్.. పశ్చిమ బెంగాల్లో ‘తెలుగు’ వెలుగు..!

    ఇంటి నుంచి సులభంగా పేరు, అడ్రస్, ఇతర వివరాలను మార్చుకోవచ్చు. చాలామంది వేర్వేరు కారణాల వల్ల ఒక ఊరు నుంచి మరో ఊరుకు వెళుతూ ఉంటారు. అలా వెళ్లిన ప్రతిసారి ఆధార్ సెంటర్ కు వెళ్లి మార్చుకోవడం సులభం కాదు. గతంలో యూఐడీఐఏ కొన్ని నెలల పాటు పేరు, ఇతర వివరాలను మార్చుకునే సదుపాయాన్ని తొలగించింది. యూఐడీఐఏ ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించింది.

    Also Read: రైతులతో మాట్లాడబోతున్న మోదీ.. దీక్షలను ముగించేస్తారా?

    https://ssup.uidai.gov.in/ssup/login.html లింక్ ద్వారా అవసరమైతే ఆధార్ కార్డులోని వివరాలను మార్చుకోవచ్చు. అయితే తప్పులు ఉంటే మాత్రమే ఆధార్ కార్డ్ లోని వివరాలను మార్చుకోవడానికి ప్రయత్నించాలి. తప్పులు లేకపోయినా ఒకటి కంటే ఎక్కువసార్లు ఆధార్ కార్డులో వివరాలను మారిస్తే మాత్రం తరువాత మార్చుకోవడానికి వీలు ఉండదు. అందువల్ల ఆధార్ కార్డులో వివరాలను మార్చుకునే సమయంలో జాగ్రత్త వహించాలి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    అయితే ఆధార్ కార్డుకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లింక్ అయితే మాత్రమే సులభంగా వివరాలను మార్చుకోవచ్చు. ఈ సర్వీసులను వినియోగించుకోవడానికి ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను కూడా సులభంగా మార్చుకోవచ్చు.