HomeజాతీయంDwaraka Nagaram: సముద్ర గర్భంలో మునిగిన కృష్ణుడి ద్వారక సొగసు చూడతరమా?

Dwaraka Nagaram: సముద్ర గర్భంలో మునిగిన కృష్ణుడి ద్వారక సొగసు చూడతరమా?

Dwaraka Nagaram: కార్తికేయ 2, అంతకు ముందు వచ్చిన దేవీపుత్రుడు.. శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక నగరం గురించి చెప్పాయి. వాస్తవానికి మన చారిత్రక పుస్తకాలో తప్పా ద్వారక గురించి పెద్దగా తెలిసిన దాఖలాలు లేవు. సినిమాల్లో అంటే అది ఫిక్షన్ తరహా కాబట్టి.. అందులో కొన్ని నిజానికి అతితమైన విషయాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి.. అందులో ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియో వైరల్ గా మారింది. మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారక సామ్రాజ్యం గురించి ఎటువంటి విషయాలు చెప్పింది? మీరూ చదివేయండి.

ద్వారక.. వినగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పరిపాలించిన ఈ నగరం సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలం చేకూర్చే విధంగా ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగానే ఉన్నాయి. ఇక హిందువులు అతి పవిత్రంగా భావించే ధామాలలో( చార్ ధామ్) లో ద్వారక ఒకటి. ద్వారక అంటే అనేక ద్వారాలు కలది అని అర్థం. వేద వ్యాసుడు రాసిన మహాభారత కావ్యం లో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఈ నగరం ఉంది. శ్రీకృష్ణుడు మధుర ప్రాంతంలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధ రాజైన జరాసంధుడి మధుర పై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను మొత్తం ద్వారకా నగరానికి తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలను మొత్తం కలిపి విశ్వకర్మ చేతుల మీదుగా ద్వారక అనే మహా నగరాన్ని నిర్మించాడు. ద్వారకానగరం సంయుక్త రాజ్యాల సమహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. ద్వారకను పరిపాలించిన యాదవులను దశరాస్ అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృత వర్మ, ఉద్దవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు వంటి వారు ద్వారకానగరంలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు.

ద్వారకా నగరాన్ని గోమతి నది తీరంలో అత్యంత ప్రణాళిక బద్ధంగా నిర్మించారు. విశ్వకర్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ నగరాన్ని నిర్మించాడు. ద్వారకా నగరాన్ని నిర్వహణ సౌలభ్యం కోసం ఆరు విభాగాలుగా రూపొందించారు. ఆ రోజుల్లోనే నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్ళు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారకానగరం నిర్మితమైంది. రాజ్యసభ మంటపం పేరుతో సుధర్మ సభ ఏర్పాటు చేశారు. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. అందమైన కట్టడాలు మాత్రమే కాదు ప్రకృతి సోయగాలతో ద్వారకానగరం స్వర్గాన్ని మించి తలపించేది. సముద్ర తీరంతో ఆ ప్రాంతం మొత్తం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం అనంతరం 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది.

Dwaraka Nagaram
Dwaraka Nagaram

 

మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138 లో జరిగింది. ఆ తర్వాత 36 సంవత్సరాలు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. శ్రీకృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలయించుకోవడం ద్వారా సామ్రాజ్యం పతనమైంది. అంతేకాదు యాదవ కులం కూడా అంతర్గత కలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. ఆమె శపించినట్టుగానే యాదవ కులం మొత్తం నశించిపోయింది. యాదవ సామ్రాజ్యం పతనం తర్వాత బలరాముడు యోగం తర్వాత తన దేహాన్ని మొత్తం త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడు. అయితే ఒక బోయవాడు ( పూర్వ జన్మలో వాలి) బాణం వల్ల కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు 120 ఏళ్ళు జీవించాడని చరిత్ర చెబుతోంది. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకా నగరాన్ని మొత్తం ముంచెత్తిందని చరిత్ర చెబుతోంది. రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపోవడం చూసానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం విశేషం.

సముద్రం ఎగిసి పడే ముందు భారీ గాలులు విచాయి. ద్వారక నగరంలో ప్రజలు వాడే మట్టి పాత్రలు వాటికవే పగిలిపోయాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన కృష్ణుడు అందరిని సమావేశపరిచి పవిత్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడు పిలుపుతో ద్వారక వచ్చిన అర్జునుడికి ఈ విపత్తు గురించి చెప్పాడు. వారం రోజుల్లో ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతుందని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించాడు. తర్వాత కృష్ణుడు అడవి బాట పట్టడం, బోయవాడి బాణం వేటుకు దేహాన్ని త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు కృష్ణుడు, బలరాములతో సహా యాదవుల మొత్తానికి అంత్యక్రియలు నిర్వహించి.. ద్వారకా నగరంలో ఉన్న ప్రజలను, సంపదను ఇతర ప్రాంతాలకు తరలించాడు. అలా వారు నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ద్వారకా నగరాన్ని మొత్తం ముంచేశాడు. ఇక ద్వారకానగరం క్రీస్తుపూర్వం 1443లో సముద్ర గర్భంలో మునిగిపోయినట్టు చరిత్ర చెబుతోంది. గుజరాత్ లోని జాంనగర్ సముద్రతీరంలో దీనికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. 1983-86 లో గుజరాత్ సముద్రతీరంలో జరిగిన ఒక పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలు చరిత్రకారులకు కనిపించాయి. వీటి ప్రకారం ద్వారకానగరం క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల కిందటి దని నిర్ధారించారు. విశ్వకర్మ సహాయంతో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించాడని వారు వివరించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ చారిత్రాత్మక నగరం విస్తరించి ఉన్నట్టు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల చిత్రాలను విడుదల చేశారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనలో ఎన్నో ఆధారాలు సేకరించారు. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిశోధనలు మధ్యలో నిలిచిపోయాయి. ఇక ఈ నగరానికి సంబంధించి ఇన్ స్టా గ్రామ్ లో “సనాతన్ ధర్మ ఫ్యాన్” అనే ఓ పేజీ లో ద్వారకకు సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేశారు. సముద్ర గర్భంలో ద్వారక నగర విశిష్టతను ఇందులో వివరించారు. నిమిషం పాటు నిడివి ఉన్న ఈ వీడియో ఎంతో ఆసక్తికరంగా ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version