Vantara Elephant: మేడిపండు పైకి చూస్తే ఎర్రగానే కనిపిస్తుంది. దానిని విప్పి చూస్తే పురుగులు కనిపిస్తుంటాయి. అలాగే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల సంబంధం పైకి గొప్పగానే కనిపిస్తుంది. లోపల తరచి చూస్తే గాని అసలు విషయం అర్థం కాదు. ఇప్పుడు అంటే మోడీ, అదాని గొప్ప స్నేహితులు అని చెబుతున్నారు గాని.. ఒకప్పుడు రిలయన్స్ యాజమాన్యం మోదితో అత్యంత సఖ్యంగా ఉండేది. చాలా విషయాల్లో సహాయం కూడా చేసింది. ఇప్పుడు అలా దగ్గరగా కాదు.. అలాగని దూరం కూడా కాదు.. ఏదో ప్రోటోకాల్ ప్రకారం కలిసి ఉన్నట్టు.. స్నేహం కొనసాగుతున్నట్టు మోడీ, అంబానీ నటిస్తున్నారు. ఆమధ్య ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి జరిగితే నరేంద్ర మోడీ స్వయంగా వెళ్లారు. నూతన జంటను ఆశీర్వదించారు. మోడీ తన స్టైల్ లో తను ఉండగా.. ముఖేష్ అంబానీ మాత్రం మీద మీద పడిపోయారు.. దీనిని బట్టి మా ఇద్దరి మధ్య ఎటువంటి గ్యాప్ లేదని ముకేశ్ అంబానీ బయటికి చెప్పడానికి ప్రయత్నించారు.
ఇటీవల అమెరికాలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ముకేశ్ అంబానీ ప్రణాళికల రూపొందించినట్టు తెలుస్తోంది. 200 కోట్లలో ఒక ఖరీదైన భవనాన్ని కూడా కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. అమెరికాకు ముకేశ్ అంబానీ ఏ లక్ష్యంతో వెళ్తున్నారో తెలియదు? ఎందుకు వెళ్తున్నారో తెలియదు? అంతటి ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్ ఏఐ మన దేశానికి తరలివస్తుంటే.. రిలయన్స్ అమెరికా వెళ్లిపోవడం సహజంగానే మన దేశ పరిపాలకుడికి నచ్చలేదు. ఈ మాట మేం చేస్తున్న ఆరోపణ కాదు. కొద్దిరోజులుగా న్యూ ఢిల్లీ సర్కిల్స్లో వినిపిస్తున్నదే. అయితే రిలయన్స్ వ్యాపారం విస్తరణకు మోడీ మోకాలు అడ్డలేదు. బహిరంగంగా వ్యతిరేకించలేదు. సులభంగా ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ మానస పుత్రిక ఆయన వంతార మీద చిన్న బాణం వేశాడు. అది కాస్త ఏం చేయాలో అది చేసింది. దీంతో అమెరికాకు విస్తరించాలని రిలయన్స్ వ్యూహం ఆగిపోయింది. అనంత్ అంబానీ గుజరాత్ రాష్ట్రంలో జంతు సంరక్షణ కోసం వంతారా అనే వ్యవస్థ ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రానికి విదేశాల నుంచి ఏనుగులను తీసుకొస్తున్నారని ఒక ప్రధాన అభియోగం. సర్వోన్నత న్యాయస్థానంలో దీనిపై ఒక ఫిర్యాదు నమోదయింది.
ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీంకోర్టులో తాను విచారించిన తీరును నివేదిక రూపంలో దాఖలుపరచింది. నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు ఆకాశంబానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నిబంధనలకు లోబడి ఏనుగులను తరలిస్తే అందులో ఎలాంటి తప్పు లేదని పేర్కొంది. ఏనుగులను యజమానులకు అందించాలని నిర్ణయం సరికాదని స్పష్టం చేసింది. ఏ వ్యాపారి అయినా సరే తన వ్యాపారాన్ని విస్తరించాలని కోరుకుంటాడు. అందులో తప్పులేదు కూడా. కానీ ఒక దేశ పరిపాలకుడికి లోబడి ఒక వ్యాపారి నడుచుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కాలర్ ఎగరేస్తే ఇదిగో ఇలాంటిదే ఎదురవుతుంది. నరేంద్ర మోడీ ఒకప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి కాదు. ఇండియా ప్రధానమంత్రి మాత్రమే కాదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు. సులభంగా చెప్పాలంటే ట్రంపును ధిక్కరించి.. జిన్ పింగ్ కు సవాల్ విసిరే స్థాయి ఉన్న నాయకుడు. అలాంటి వ్యక్తితో ముకేశ్ అంబానీ పెట్టుకుంటే ఏమవుతుంది.. ఇదిగో ఇలా అవుతుంది.