Trump TikTok: బలహీనులు బలం కోసం చూస్తూ ఉంటే.. బలవంతులు మరింత బలాన్ని పెంచుకోవడం కోసం చూస్తుంటారు. అప్పట్లో ఓ తెలుగు సినిమాలో వినిపించిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ఇప్పుడు చైనా, అమెరికా మధ్య వాస్తవ రూపం దాల్చే విధంగా కనిపిస్తోంది. ఆర్థికంగా ఈ రెండు దేశాలు అత్యంత బలవంతమైనవి. శక్తివంతమైనవి. తమ శక్తిని ప్రదర్శించుకునే అవకాశాన్ని ఈ రెండు దేశాలు ఏ సందర్భంలో కూడా వదులుకోవడం లేదు. పైగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవల అమెరికా ప్రపంచ దేశాల మీద టారిఫ్ లు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వ్యతిరేకంగా చైనా కూటమిని ఏర్పాటు చేయడంలో విజయవంతమైంది. మొత్తంగా చూస్తే నువ్వా నేనా అన్నట్టుగా ఈ రెండు దేశాలు పోటీ పడుతున్నాయి.
సైనిక సామర్థ్యాన్ని, ఆర్థిక పరిపుష్టిని మాత్రమే కాకుండా వ్యాపార పరంగా కూడా ఈ రెండు దేశాలు అత్యంత బలవంతమైనవి. అందువల్లే వ్యాపార కోణాల్లో కూడా చైనా, అమెరికా పరస్పరం పోటీ పడుతున్నాయి. బలవంతమైన సంస్థలను దక్కించుకోవడంలో.. వాటిని నిలుపుకోవడంలో తమ వంతు ఎత్తులు వేస్తున్నాయి. ఇవి ఎంతవరకు వెళ్తాయి.. ఎంతవరకు దారి తీస్తాయి అనే విషయాలను కాస్త పక్కన పెడితే.. ప్రస్తుత పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే వ్యాపార కోణంలో మాత్రం అమెరికా చైనా దెబ్బ కొట్టడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అందువల్లే ఫార్మా, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో సరికొత్త అవకాశాలను సృష్టించడానికి అమెరికా సిద్ధమవుతోంది. దీనికంటే ముందుగానే చైనా ఆర్థిక మూల స్తంభాలలో ఒకటైన టిక్ టాక్ ను దెబ్బ కొట్టడానికి అమెరికా సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక వార్త ఇంటర్నేషనల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
సెప్టెంబర్ 17 వరకు కల్లా టిక్ టాక్ పగ్గాలు అమెరికాకు దక్కుతాయని తెలుస్తోంది. ఒకవేళ అలా జరగకపోతే అమెరికాలో ఆ యాప్ ను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికా, చైనా ఒక ఒప్పందానికి వచ్చాయని సమాచారం.. మరోవైపు దీనిని ధృవీకరించే దిశగా ట్రంప్ కీలక ట్వీట్ చేశారు..” దేశంలో మెజారిటీ యువత ఎంతగానో కోరుకుంటున్నది. వారు కోరుకుంటున్నట్టుగా ఒక డీల్ దాదాపుగా పూర్తయింది. అధికారికంగా సమాచారం బయటకు రావడమే ఆలస్యమని” ట్రంప్ పేర్కొన్నారు. వైపు త్వరలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ట్రంపు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఈ డీల్ కోసం ఫ్రేమ్ వర్క్ కూడా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి..”చైనా ఆర్థిక స్తంభాలలో టిక్ టాక్ కూడా ఒకటి. ఇది ఆ దేశ ఆర్థిక రంగానికి ఊతం కల్పిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఆ యాప్ ఊహించని పురోగతిని సాధిస్తోంది. అందువల్లే దీనిని దక్కించుకోవడానికి అమెరికా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేవలం అమెరికాలో అందించే సేవలో విషయంలోనైనా.. యాప్ మొత్తాన్ని దక్కించుకుంటారా.. అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉందని” అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.