Ayodhya Ram Mandir : అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్టకు వేళైంది. దేశమంతా పండుగ వాతావరణంలో ఈ వేడుక జరుగబోతోంది. శిల్పులు ఎంతో తీక్షణతో చెక్కిన శ్రీరాముడి విగ్రహం ఇప్పటికే రివీల్ అయ్యింది. అయితే ముఖాన్ని కప్పి ఉంచడంతో రాముడి మోము ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.

తాజాగా అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఐదేళ్ల వయసున్న బాలరాముడి విగ్రహ ముఖరావింద చిత్రాలు బయటకు వచ్చాయి.
తొలుత ముఖానికి వస్త్రం కప్పి ఉన్న ఫొటోలు విడుదల కాగా.. ఇప్పుడు ఆయన ముఖ అరవిందం బయటకు వచ్చింది. మోము అద్భుతంగా చెక్కబడింది. మందస్మితుడైన రామ్ లల్లాను చూసి భక్తులు పరవశించిపోతున్నారు. ఈనెల 22న ప్రాణప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది.
శ్రీరాముడి ఠీవీ, తీక్షణ, దర్జా మొత్తం ఈ విగ్రహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. శిల్పి చెక్కిన రాముడి ముఖ అరవిందం చూస్తే రెండు కళ్లు చాలవు. అంత అద్భుతంగా నవ్వు ముఖాన్ని తీర్చిదిద్దాడు. అయోధ్య బాలరాముడి ముఖం ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.