Gyanvapi Case: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఇటీవల రామాలయాన్ని ప్రారంభించారు. ఇది ఆషామాషీ ఆలయం అయితే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ దీని వెనక వందల ఏళ్ల చరిత్ర.. కోర్టు కేసులు ఉన్న నేపథ్యం.. బాబ్రీ మసీదు కూల్చిన వివాదం ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా దీనికి ప్రాముఖ్యత ఏర్పడింది. అంతేకాదు ఇందులో బాల రాముడి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేయడంతో ఒక్కసారిగా ఇది వార్తల్లోకెక్కింది. దీనిని మరవక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి ప్రాంతంలోని జ్ఞానవాపి మసీదు చర్చల్లోకి వచ్చింది. అయితే ఈ మసీదును కూడా పురాతన హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించారని.. దానికి తగ్గట్టుగా ఆనవాళ్లు ఉన్నాయని ఇప్పుడు తెరపైకి రావడంతో మరో సంచలనం నమోదయింది. ఈ నేపథ్యంలో జ్ఞానవాపి కూడా మరో అయోధ్య అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వారణాసిలోని జ్ఞానవాపీ మసీదుకు సంబంధించిన వివాదం ఈనాటిది కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ మసీదు కింద హిందూ ఆలయం ఉండేదని.. కానీ దానిని ధ్వంసం చేసి మసీదు నిర్మించారని హిందూ సంఘాలవారు సరి కొత్త అంశాన్ని లేవనెత్తారు. అంతేకాదు కోర్టుల్లో కూడా పిటిషన్లు దాఖలు చేశారు. హిందూ సంఘాలకు కౌంటర్ గా ముస్లిం సంఘాలు కూడా కోర్టును ఆశ్రయించడంతో ఒక్కసారిగా ఈ అంశం వివాదం రూపు సంతరించుకుంది. అయితే అప్పట్లో ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు మసీదులో తవ్వకాలు జరపాలని ఆదేశించింది. దాని ప్రకారం జాతీయ పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది. ఈ క్రమంలో ఆ మసీదు కింద దేవాలయ ఆనవాళ్లు ఉన్నాయని ప్రకటించింది. కోర్టు ఆదేశాల మేరకు పురావస్తు శాఖ దాదాపు 839 పేజీల నివేదిక అందజేసింది. ఇక ఈ నివేదికకు సంబంధించిన ముఖ్యంశాలను హిందువుల తరఫున కోర్టులో వాది
స్తున్న న్యాయవాది శంకర్ జైన్ వెల్లడించారు. మసీదు ఆవరణలో భారీ హిందూ ఆలయం ఉన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయని.. అంతకు ముందు ఉన్న దేవాలయం పైనే ప్రస్తుతం ఉన్న మసీదు నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు ఇందుకు సంబంధించిన ఆధారాలను పురావస్తు శాఖ తన నివేదికలో పొందుపరిచిందని ఆయన ప్రకటించారు. ఆ ప్రదేశంలో అనేక పురావస్తు నిర్మాణపు పొరలకు సంబంధించిన ప్రశ్నలను జాతీయ పురావస్తు శాఖ లేవనెత్తిందని వివరించారు.
ఆలయంలో స్వల్పంగా మార్పులు చేసి మసీదుగా మార్చారని.. దేవాలయపు స్తంభాలను, ఇతర నిర్మాణాలను మసీదు కోసం వాడుకున్నారని వివరించారు. దేవాలయపు స్తంభాలపై ఉన్న కళాకృతులను చెరిపి వేసినట్టు ఆయన వెల్లడించారు. ప్రధాన దేవాలయానికి సంబంధించిన శాసనాలు కూడా ఆ ఆవరణలో లభించాయని.. అవి దేవనాగరి.. తెలుగు.. కన్నడ తో పాటు ఇతర భాషల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. పురావస్తు శాఖ తవ్వకాలలో ప్రస్తుతం ఉన్న మసీదుపై అనేక శాసన లభించాయి. పురావస్తు శాఖ నిర్వహించిన ప్రస్తుత సర్వేలో 34 శాసనాలు, 32 ముద్రలు ఉన్న పత్రాలు బయటపడ్డాయి. అంతేకాదు దేవాలయానికి సంబంధించిన బండపురాయిపై శాసనాలు కనిపించాయి. ఆ రాయిని మసీదు నిర్మాణంలో.. ఆ తర్వాత మరమ్మతు సమయంలో కూడా వాడుకున్నారు. దీనిని బట్టి పూర్వ నిర్మాణాన్ని కూల్చివేసి దానికి సంబంధించిన కొన్ని భాగాలను నూతన మసీదు నిర్మాణంలో వాడుకున్నట్టు తెలుస్తోంది. ఇక అక్కడ లభించిన శాసనాలలో జనార్ధన, రుద్ర, మహేశ్వర అనే దేవతల పేర్లు కనిపించాయి. కాదు తామర పతకానికి ఇరువైపులా చెక్కిన వ్యాల బొమ్మలను కూడా చెరిపివేశారు. ఇక ఆలయం మూలలో ఉన్న బండరాళ్ళను తొలగించి, ఆ స్థలాన్ని పువ్వులే ఆకృతుల్లో నింపేశారు.
ఇక వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కన ఉన్న జ్ఞానవాపి మసిదుపై పురావస్తు శాఖ నిర్వహించిన సర్వే కు సంబంధించిన నివేదికను హిందువులకు, ముస్లింలకు అందజేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న 17వ శతాబ్దం నాటి జ్ఞానవాపీ మసీదు ను అంతకు ముందు ఉన్న దేవాలయాన్ని కూల్చివేసి నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపించి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో ఈ విషయాలన్నీ బయటపడుతున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో నరేంద్ర మోడీ పర్యటించినప్పుడు.. కాశీ విశ్వనాథుడి సంకెళ్లు కూడా పెంచుతామని ప్రకటించారు. ఆయన చెప్పిన విధంగానే పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలలో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తుండడం విశేషం. అయితే జ్ఞానవాపి కూడా మరో అయోధ్యగా మారుతుందని.. ప్రస్తుతం వెలుగు చూస్తున్న చారిత్రాత్మక ఆనవాళ్లు కూడా అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయని హిందూ సంఘాల బాధ్యులు అంటున్నారు.