https://oktelugu.com/

చేతులు జోడించి వేడుకుంటున్న స్టార్ హీరో.. ఎవరికోసం?

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు సుశాంత్ ది ది ఆత్మహత్య కాదని.. హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ ఆరోపించారు. ఇక ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా అబాసుపాలైంది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది. Also Read: బిగ్ బాస్ కాదు బ్యాడ్ బాస్.. అన్యాయంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 4, 2020 11:27 am
    Follow us on

    యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు సుశాంత్ ది ది ఆత్మహత్య కాదని.. హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ ఆరోపించారు. ఇక ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా అబాసుపాలైంది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది.

    Also Read: బిగ్ బాస్ కాదు బ్యాడ్ బాస్.. అన్యాయంగా ఇద్దరి ఎలిమినేషన్..?

    కొద్దిరోజులుగా ఇండస్ట్రీపై నెపోటిజం.. డ్రగ్స్ లింకులపై విమర్శలు వస్తున్నా బాలీవుడ్లోని ప్రముఖులెవరూ స్పందించిన దాఖలులేవు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోని వారందరినీ మీడియా.. నెటిజన్లు ఒకేగాటినకట్టి విమర్శించడం మొదలుపెట్టాడు. దీంతో బాలీవుడ్ పరిశ్రమ అంటేనే ప్రతీఒక్కరూ చీదరించుకునే పరిస్థితులు వచ్చాయి. స్టార్ హీరోహీరోయిన్ల తెరవెనుక బాగోతాలపై రకరకాల కథనాలు వస్తున్నాయి. దీంతో ఇన్నిరోజులు స్తబ్ధుగా ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీలోని సెలబ్రెటీలు తమ గళం విప్పుతున్నారు.

    తాజాగా ఈ విషయాలపై హీరో అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘చాలా బరువెక్కిన హృదయంతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను.. నా అభిప్రాయాలను చెప్పాలని ఎప్పటి నుంచో వేచి చూస్తున్నా.. కానీ సరైన సమయం కాదని అనిపించింది.. ఎవరికీ.. ఎలా.. ఏం చెప్పాలో అర్థంకాక ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయాన’ని చెప్పారు.

    ‘సుశాంత్ మృతి తర్వాత అభిమానులు ఎంత బాధపడ్డారో.. ఇండస్ట్రీలోని వారంతా మేము బాధపడ్డామని చెప్పారు. ఆ తర్వాత డ్రగ్స్ బయటపడటంతో ఇప్పుడంతా వాటి గురించే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. బాలీవుడంతా క్లీన్ గా ఉందని అబద్దం చెప్పనుగానీ.. అన్నిరంగాల్లో ఉండేది ఇండస్ట్రీలోనూ ఉందన్నారు. చిత్రసీమలోని ప్రముఖలంతా వీటిపై  దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

    Also Read: కరోనా ఎఫెక్ట్: టాలీవుడ్ కీలక నిర్ణయం

    డ్రగ్స్ కేసుపై చట్టం.. న్యాయ వ్యవస్థలు తగినవిధంగా నిర్ణయం తీసుకుంటాయనే ఆశాభావాన్ని అక్షయ్ వెలిబుచ్చారు. అయితే ఇండస్ట్రీలోని వారందరిని దోషులుగా చూడటం కరెక్ట్ కాదన్నారు. ఎవరో ఒక్కరు చేసిన తప్పుడు పనికి ఇండస్ట్రీ అంతటినీ బాదానం చేయద్దని చేతులు జోడించి వేడుకున్నారు. ప్రేక్షకుల అభిమానం వల్లే తాము స్టార్లుగా మారామని.. ప్రస్తుతం వారు తమపై కోపంగా ఉన్నారని.. దానిని కూడా మేము స్వీకరించాల్సిందేనని అక్షయ్ కుమార్ తెలిపారు.

    https://www.youtube.com/watch?v=V2SKY5YIWZE#action=share