HomeజాతీయంSri Sri Daughter: తెలుగు కవి శ్రీశ్రీ కూతురు సాధించింది..

Sri Sri Daughter: తెలుగు కవి శ్రీశ్రీ కూతురు సాధించింది..

Sri Sri Daughter: సుప్రసిద్ధ విప్లవ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీశ్రీ) కుమార్తె నిడుమోలు మాలా మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మద్రాస్‌ హైకోర్టుకు న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వీరిలో మాలా, ఎస్‌.సౌందర్‌ పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈమేరకు మార్చి 24న ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశ్రీ–సరోజా దంపతుల నాలుగో సంతానమైన మాలా మద్రాస్‌ లా కళాశాల నుంచి డిగ్రీ పొందారు. 32 ఏళ్లుగా మద్రాస్‌ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న మాల 2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాలా భర్త నిడుమోలు రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉన్నతాధికారిగా ఉన్నారు. వారిది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా. మాలా–రాధారమణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శ్రీనివాస్‌ జయప్రకాశ్‌ కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు.

తొమ్మిది మంది నియామకానికి సిఫారసు..
సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా తొమ్మిది మందిని దేశంలోని ఐదు హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించింది. వీరిలో ఆరుగురు న్యాయవాదులు, మిగిలిన ముగ్గురు జ్యుడీషియల్‌ అధికారులని న్యాయమంత్రిత్వశాఖ ట్వీట్‌ చేసింది. న్యాయవాదులైన రాహుల్‌ భర్తీ, మోక్షా ఖజూరియా కాజ్మీలను జమ్మూకశ్మీర్‌ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. వీరిలో తొలుత ఖాజ్మీని 2019 అక్టోబరులో, రాహుల్‌ను గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా, ఆ ఇద్దరి పేర్లను గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం తిప్పిపంపింది. దీంతో గతేడాది చివరిలో వీరిద్దరి పేర్లను మరోసారి సుప్రీం కొలీజియం సిఫారసు చేయగా, ఎట్టకేలకు కేంద్రం ఇప్పుడు ఆమోదించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version