https://oktelugu.com/

క్రెడిట్ కార్డ్ లిమిట్ తక్కువగా ఉందా.. పెంచుకోవడం ఎలా అంటే..?

దేశంలో క్రెడిట్ కార్డ్ యూజర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు అర్హత ఉన్న ఉద్యోగులు, వ్యాపారులకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. అయితే చాలామంది క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగించినా క్రెడిట్ కార్డ్ లిమిట్ తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అయితే రెండు ఆప్షన్ల ద్వారా సులభంగా క్రెడిట్ కార్డ్ లిమిట్ ను పెంచుకోవడం సాధ్యమవుతుంది. Also Read: కరోనా వాక్సి‘నేషన్’.. ఐదు దశల్లో..! దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 5, 2021 4:56 pm
    Follow us on

    Credit Card Limit

    దేశంలో క్రెడిట్ కార్డ్ యూజర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు అర్హత ఉన్న ఉద్యోగులు, వ్యాపారులకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. అయితే చాలామంది క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగించినా క్రెడిట్ కార్డ్ లిమిట్ తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అయితే రెండు ఆప్షన్ల ద్వారా సులభంగా క్రెడిట్ కార్డ్ లిమిట్ ను పెంచుకోవడం సాధ్యమవుతుంది.

    Also Read: కరోనా వాక్సి‘నేషన్’.. ఐదు దశల్లో..!

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలని భావించే వాళ్లకు శుభవార్త చెప్పింది. సాధారణంగా క్రెడిట్ కార్డును వినియోగించే వాళ్లు టోటల్ క్రెడిట్ లిమిట్, క్యాష్ లిమిటి, క్రెడిట్ లిమిట్ గురించి అవగాహన కలిగి ఉండాలి. క్యాష్ లిమిట్ ఎంత ఉంటే అంత మొత్తాన్ని వినియోగదారులు ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కార్డుపై ఉండే లిమిట్ టోటల్ క్రెడిట్ లిమిట్ కాగా కార్డు ద్వారా చేసిన ఖర్చును మినహాయిస్తే క్రెడిట్ లిమిట్ ఎంతో తెలుసుకోవచ్చు.

    Also Read: వివాదంలో టీమిండియా క్రికెటర్లు..: ఆవుమాంసాన్ని ఫుల్లుగా మెక్కేశారుగా..

    సాధారణంగా ఎస్బీఐ బ్యాంక్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ యూజర్లకు ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్ ఆఫర్ ను అందజేస్తోంది. ఈ ఆఫర్ కు అర్హత ఉన్నవారికి మెయిల్ లేదా మెసేజ్ ద్వారా ఆఫర్ కు సంబంధించిన సమాచారం అందుతుంది. ఆ తర్వాత సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి సులభంగా క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ ను పెంచుకునే అవకాశం ఉంటుంది.

    మరిన్ని జాతీయం వార్తల కోసం జాతీయం

    ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్ ఆఫర్ కు సంబంధించి మెసేజ్ లేదా ఈ మెయిల్ రాకపోతే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ అధికారులను సంప్రదించడం 1860 180 1290 నెంబర్లకు కాల్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డ్ లిమిట్ ను పెంచుకోవడం సాధ్యమవుతుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు మాత్రమే ఈ విధంగా పరిమితిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇతర బ్యాంకులలో క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంపుకు సంబంధించి నియమనిబంధనల్లో మార్పులు ఉంటాయి.