https://oktelugu.com/

కార్పొరేటర్లపై అనర్హత.. ఎన్నికల కమిషన్ వార్నింగ్..!

గతేడాది డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడికాగా ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. Also Read: రేప్ చేసి చంపుతాడు! శవాలతో పైశాచికం.. వంద మందిని.. సైకోకిల్లర్ కథ! జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56.. బీజేపీ 48.. ఎంఐఎం 44.. కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. గ్రేటర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ అవతరించినప్పటికీ మేయర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 3, 2021 10:32 am
    Follow us on

    GHMC

    గతేడాది డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడికాగా ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.

    Also Read: రేప్ చేసి చంపుతాడు! శవాలతో పైశాచికం.. వంద మందిని.. సైకోకిల్లర్ కథ!

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56.. బీజేపీ 48.. ఎంఐఎం 44.. కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. గ్రేటర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ అవతరించినప్పటికీ మేయర్ పీఠానికి అందనంత దూరంలో ఉంది.

    ప్రస్తుత పాలకవర్గానికి ఫిబ్రవరి 10వరకు సమయం ఉండటంతో ఇంకా పాత కార్పొరేటర్లే ఆయా డివిజన్లలో పనులను పర్యవేక్షిస్తున్నారు. దీంతో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు.. పాత కార్పొరేటర్లకు మధ్య విభేధాలు నెలకొంటున్నాయి.

    ఈక్రమంలోనే కొత్త కార్పొరేటర్లను గుర్తించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తులు చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ప్రచార ఖర్చుకు వెల్లడించాలని లేనట్లయితే అనర్హత తప్పదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆర్.పార్థసారధి హెచ్చరించారు.

    Also Read: ఇగ్లూ ఇల్లు.. మజాగుండు.. చలికాలంలో చూడాల్సిన మన ప్రదేశాలు

    జనవరి 8న ఎన్నికల ఖర్చులపై అబ్సర్వర్లతో సమీక్ష స‌మావేశం నిర్వహించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీలో గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గెజిట్లో ప్రచురించాల్సి ఉందని తెలిపారు.

    ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులంతా విధిగా తమ ఖర్చుల వివరాలను వెల్లడించాలని కోరారు. సకాలంలో ఖర్చుల వివరాలను అభ్యర్థులు ప్రకటించకపోతే అనర్హత తప్పదని స్పష్టం చేశఆరు.దీంతో ప్రమాణ స్వీకరానికి ముందే కార్పొరేటర్లపై అనర్హత వేటు వేలాడుతున్నట్లు కన్పిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్