నేడు ఖేల్ రత్న అందుకోనున్న రోహిత్ శర్మ

ప్రముఖ హకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతీయేటా కేంద్రం జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఆగస్టు 29న క్రీడా పురస్కారాలతో సత్కరిస్తోంది. ఈసారి దేశంలో కరోనా మహ్మమరి కారణంగా తొలిసారి ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. మొత్తంగా 74మంది క్రీడాకారులకు కేంద్రం అవార్డులను అందజేయనుంది. Also Read: ధోనీ టీమ్‌లో 13 మందికి కరోనా.. ఐపీఎల్‌పై నీలినీడలు! ఈ ఏడాది రాజీవ్ ఖేల్ రత్నకు ఐదుగురిని […]

Written By: Neelambaram, Updated On : August 29, 2020 3:30 pm
Follow us on


ప్రముఖ హకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతీయేటా కేంద్రం జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఆగస్టు 29న క్రీడా పురస్కారాలతో సత్కరిస్తోంది. ఈసారి దేశంలో కరోనా మహ్మమరి కారణంగా తొలిసారి ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. మొత్తంగా 74మంది క్రీడాకారులకు కేంద్రం అవార్డులను అందజేయనుంది.

Also Read: ధోనీ టీమ్‌లో 13 మందికి కరోనా.. ఐపీఎల్‌పై నీలినీడలు!

ఈ ఏడాది రాజీవ్ ఖేల్ రత్నకు ఐదుగురిని ఎంపిక చేశారు. క్రికెట్ నుంచి భారత వైస్ కెప్టెన్, డ్యాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఉన్నారు. 2019లో రోహిత్ శర్మ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చూపించినందుకు బీసీసీఐ అతడిని ఖేల్ రత్నకు సిఫార్సు చేసింది. అవార్డు కమిటీ రోహిత్ కు అవార్డుకు ఎంపిక చేసింది. దీంతో నేడు రోహిత్ శర్మకు కేంద్రం అవార్డు అందజేస్తోంది. ఖేల్ రత్న అందుకోనున్న నాలుగో క్రికెటర్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. రోహిత్ కంటే ముందుగా సచిన్ టెండుల్కర్, ధోని, విరాట్ కోహ్లీలు ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు.

రోహిత్ పాటు రాజీవ్ ఖేల్ రత్నకు రెజ్లింగ్ నుంచి వినేశ్ పొగట్, హకీ నుంచి రాణి రాంపాల్, టేబుల్ టెన్నిస్ నుంచి మనిక బాత్ర, పారా అథెటిక్స్ నుంచి మరియప్పన్ ఎంపికయ్యారు. అదేవిధంగా అర్జున అవార్డుకు 27మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. వీరిలో క్రికెట్ నుంచి ఫాస్టు బౌలర్ ఇషాంత్ శర్మ ఎంపికయ్యాడు. గతేడాది టెస్టులో మంచి ప్రతిభ చూపించినందుకు ఇషాంత్ ను బీసీసీఐ అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది.

Also Read: ‘గాల్లో’ ఎగరాలంటే మాస్కు ఉండాల్సిందే..!

ఇషాంత్ శర్మతోపాటు దీప్తి శర్మ క్రికెట్ నుంచి ఎంపికైంది. ఆర్చరీ నుంచి అతాను దాస్, అథ్లెట్ నుంచి ద్యుతీ చంద్, సందీప్, బ్యాడ్మింటన్ నుంచి చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, ఫుట్ బాల్ నుంచి సందేశ్, గోల్ఫ్ నుంచి అదితి అశోక్, బాస్కెట్ బాల్ నుంచి విశేష్, బాక్సింగ్ నుంచి సుబేదార్ కౌశిక్, లోవ్లినా, హాకీ నుంచి అక్షదీప్ సింగ్, దీపిక, ఈక్వెస్ట్రైన్ నుంచి శావంత్ అజయ్ కబడ్డీ నుంచి దీపక్, ఖోఖో నుంచి సుందర్ ఎంపికయ్యారు.

రోయింగ్ నుంచి దత్తు బాబన్, షూటింగ్ నుంచి మనుబాకర్, సౌరబ్ చౌదరి, టెబుల్ టెన్నిస్ నుంచి మధురిక, టెన్నిస్ నుంచి దివిజ్ శరణ్, వింటర్ స్పోర్ట్స్ నుంచి శివ కేశవన్, రెజ్లింగ్ నుంచి దివ్య, రాహుల్, పారా స్మిమ్మింగ్ నుంచి నారాయణ యాదవ్, పారా షూటింగ్ నుంచి మనీశాలు అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. వీరందరికీ కేంద్రం నేడు అవార్డులను అందజేయనుంది.