చెన్నై టీమ్‌కు మరో షాక్..‌ ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న సురేశ్‌ రైనా

ప్రతిష్టాత్మక ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ పదమూడో సీజన్‌ దగ్గర పడుతున్న కొద్దీ షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19వ తేదీన మొదలవ్వాల్సిన ఈ మెగా లీగ్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు వరుసగా రెండో షాక్‌ తగిలింది. ప్రస్తుతం ఆ జట్టు దుబాయ్‌లో ప్రత్యేక హోటల్లో ఉంది. అక్కడి స్థానిక ప్రభుత్వం, బీసీసీఐ మార్గనిర్దేశాల మేరకు […]

Written By: Neelambaram, Updated On : August 29, 2020 3:39 pm
Follow us on


ప్రతిష్టాత్మక ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ పదమూడో సీజన్‌ దగ్గర పడుతున్న కొద్దీ షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19వ తేదీన మొదలవ్వాల్సిన ఈ మెగా లీగ్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు వరుసగా రెండో షాక్‌ తగిలింది. ప్రస్తుతం ఆ జట్టు దుబాయ్‌లో ప్రత్యేక హోటల్లో ఉంది. అక్కడి స్థానిక ప్రభుత్వం, బీసీసీఐ మార్గనిర్దేశాల మేరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆ జట్టులో ఏకంగా ఒక ప్లేయర్ సహా 13 మంది కరోనా బారిన పడ్డారన్న విషయం కలకలం సృష్టించింది. ఆ షాక్‌ నుంచి టీమ్‌ కోలుకోక ముందే మరో ఎదురు దెబ్బ తగిలింది.  సి ఎస్ కే స్టార్ ప్లేయర్, ఆల్‌రౌండర్ సురేశ్ రైనా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. టీమ్‌మేట్స్‌తో కలిసి దుబాయ్‌ వెళ్లిన అతను తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌ నుంచి అతను వైదొలిగాడు. ఈ విషయాన్ని సి ఎస్ కే టీమ్‌ సీఈఓ కాశీ విశ్వనాథన్‌ ధ్రువీకరించారు.

Also Read: ధోనీ టీమ్‌లో 13 మందికి కరోనా.. ఐపీఎల్‌పై నీలినీడలు!

‘సురేశ్‌ రైనా వ్యక్తిగత కారణాల వల్ల ఇండియాకు తిరిగొచ్చాడు. ఈ సీజన్‌ మొత్తానికి అతడు అందుబాటులో ఉండబోడు. ఈ సమయంలో రైనాకు, అతని కుటుంబానికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది’ అని విశ్వనాథ్‌ ప్రకటించారు. విశ్వనాథ్‌ ప్రకటన బట్టి రైనా కుటుంబంలో ఒకరు తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యారని, అందుకే అతను హుటాహుటిన దుబాయ్‌ నుంచి ఇండియాకు తిరిగొచ్చేశాడని ఐపీఎల్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జట్టులో చాలా మంది కరోనా బారిన పడడంతో ఆందోళన చెందడం వల్లే ఈ స్టార్ క్రికెట్ టోర్నీ లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సి ఎస్ కే కెప్టెన్‌ ధోనీతో రైనా చాలా సన్నిహితంగా ఉంటాడు. ధోనీ, రైనాలను క్రికెట్‌ సర్కిల్స్‌లో రామలక్ష్మణులుగా పోలుస్తారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజే నిమిషాల వ్యవధిలో అతనూ ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్‌పై దృష్టి పెట్టిన ఈ ఇద్దరూ చాలా రోజుల నుంచి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి రైనా టోర్నీకి దూరం కావడం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags