Ravi Prakash: రవిప్రకాష్ కు గట్టి షాక్ ఇచ్చిన రిపబ్లిక్ టీవీ

కెసిఆర్ ఢిల్లీలో చక్రాలు తిప్పాలి అనుకుంటున్నాడు కనుక... ఇప్పుడు ఆయనకు ఒక వేదిక కావాలి. తెలంగాణలో నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లాగా డప్పులు కొట్టే మీడియా సంస్థలు కావాలి.

Written By: Bhaskar, Updated On : May 9, 2023 11:19 am

Ravi Prakash

Follow us on

Ravi Prakash: టీవీ9 నుంచి అవమానకరంగా బయటకు వెళ్లిపోయిన తర్వాత రవి ప్రకాష్ ఏం చేస్తాడు? మై హోమ్, కేసీఆర్ తో గోక్కుంటే ఇలానే ఉంటుంది. తాను కేర్ టేకర్ మాత్రమే, అలాంటి వాడికి మొత్తం బాధ్యతలు అప్పగించి చోద్యం చూడాలా, కోట్లకు కోట్లు పక్కదారి పట్టిస్తుంటే సినిమా చూడాలా? ఇలా వినిపించాయి అప్పట్లో వ్యాఖ్యలు. అయితే రవి ప్రకాష్ టీవీ9 భారత్ వర్షను తీసుకుంటున్నాడని, అదేవిధంగా బిజెపి ఫోల్డ్ లోకి వెళ్లి పనిచేయబోతున్నాడని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఈలోపు మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు, కెసిఆర్ రవి ప్రకాష్ ను మరింత గట్టిగా గోకారు. పోలీసులతో రకరకాల కేసులు పెట్టించి కోర్టుకు ఈడ్చారు. కోర్టులోనే ఆ కేసు విచారణ సాగుతోంది. అంతేకాదు రవి ప్రకాష్ ఆ మధ్య తొలి వెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశాడు.. అది పక్కా అగైనెస్ట్ కెసిఆర్. రఘు దానికి మొన్నటిదాకా కర్త కర్మగా ఉండేవాడు.. చానెల్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత తనను మై హోమ్ యాజమాన్యం ఎలా వెలగొట్టిందో.. అలా రఘును రవి ప్రకాష్ వెళ్లగొట్టాడు. అంతేకాదు తనను ఎవరైతే గోకారో.. ఇప్పుడు వాళ్లతోనే సంధి కుదుర్చుకున్నాడు.

జాతీయ స్థాయిలో ఒక వేదిక కావాలి

కెసిఆర్ ఢిల్లీలో చక్రాలు తిప్పాలి అనుకుంటున్నాడు కనుక… ఇప్పుడు ఆయనకు ఒక వేదిక కావాలి. తెలంగాణలో నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లాగా డప్పులు కొట్టే మీడియా సంస్థలు కావాలి. ఆ మధ్య ఎన్డీటీవీతో ఒక ఒప్పందం కుదిరింది అన్నారు. తర్వాత అది గౌతమ్ ఆదాని చేతిలోకి వెళ్లడంతో ఆ డీల్ క్యాన్సిల్ అయింది. మధ్యలో ఇండియా ఆ హెడ్, జీ న్యూస్ వంటి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అవి పాలపొంగు సామెతకే పరిమితమైపోయాయి.. ఇక దీంతో లాభం లేదనుకున్న కేసీఆర్ రవి ప్రకాష్ ను పిలిపించుకున్నారు.. ఇద్దరికీ పరస్ఫర అవసరాలు ఉన్నాయి గనుక పాత పగలు పక్కన పెట్టారు.. పాలు నీళ్లలాగా కలిసిపోయారు. వెంటనే రవి ప్రకాష్ ఆధ్వర్యంలో ఆర్ అనే పేరుతో ఒక న్యూస్ ఛానల్ పురుడు పోసుకుంది. దానికి ఆర్ టీవీ అని నామకరణం చేశారు. అంతే కాదు దీనికి సంబంధించిన నియామకాలు కూడా జరుగుతున్నాయి.. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ ముందుకంటే ఈ ఛానల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అర్ణబ్ గోస్వామి దెబ్బకొట్టాడు

సాఫీగా సాగుతున్న రవి ప్రకాష్ ఆర్టీవీ ప్రయాణాన్ని రిపబ్లిక్ టీవీ ఎండీ అర్ణబ్ గోస్వామి అడ్డుకున్నాడు. తన ట్రేడ్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అంతే కాదు దీనికి గానూ 100 కోట్ల పరిహారం చెల్లించాలని తన పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే ఆర్ణబ్ గో స్వామి ఆర్ టీవీ లోగో, రవి ప్రకాష్ ఆర్ టీవీ లోగో దాదాపు ఒకే తీరుగా ఉండటం వల్లే వివాదం ఏర్పడిందని మీడియా ఎక్స్పర్ట్స్ అంటున్నారు. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఛానల్ కనుక తనకు డ్యామేజ్ అవుతుందని అర్ణబ్ గోస్వామి అంటున్నారు. దీనిపై హైకోర్టు ఎలా తీర్పు ఇస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే రెండు ఆర్ టీవీ ఛానెల్స్ మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది.