https://oktelugu.com/

రేషన్ సరుకులు తీసుకోకపోతే కార్డు రద్దు.. నిజమేనా..?

దేశంలో సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తరువాత సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రజల్లో చాలామంది ఆ ఫేక్ వార్తలను నిజమేనని నమ్ముతున్నారు. ఆ వార్తలను వాళ్లు నమ్మడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా చెబుతూ నిజమేనని నమ్మేలా చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, స్కీమ్ లు, ప్రజలకు సంబంధించిన గుర్తింపు కార్డుల విషయంలో ఈ తరహా ప్రచారం జరుగుతోంది. Also Read: మూడు డిగ్రీలో చలిలోనూ కొనసాగుతున్న రైతుల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2020 / 11:33 AM IST
    Follow us on


    దేశంలో సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తరువాత సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రజల్లో చాలామంది ఆ ఫేక్ వార్తలను నిజమేనని నమ్ముతున్నారు. ఆ వార్తలను వాళ్లు నమ్మడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా చెబుతూ నిజమేనని నమ్మేలా చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, స్కీమ్ లు, ప్రజలకు సంబంధించిన గుర్తింపు కార్డుల విషయంలో ఈ తరహా ప్రచారం జరుగుతోంది.

    Also Read: మూడు డిగ్రీలో చలిలోనూ కొనసాగుతున్న రైతుల ఆందోళనలు..!

    గత కొన్ని నెలల నుంచి మూడు నెలలు వాడకపోతే రేషన్ కార్డ్ రద్దవుతుందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. జోరుగా ఈ వార్తలు ప్రచారంలోకి రావడంతో చాలామంది నిజమేనని నమ్ముతున్నారు. వేర్వేరు కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో రేషన్ కార్డ్ వినియోగదారులు రేషన్ తీసుకోవడం సాధ్యం కాదు. అలా రేషన్ కార్డును వినియోగించుకోలేని వారంతా వైరల్ అవుతున్న వార్త వల్ల కంగారు పడుతున్నారు. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని వెల్లడించింది.

    ఒక వ్యక్తి మూడు నెలల్లో ఒక్కసారి కూడా రేషన్ కార్డును వినియోగించకపోతే రేషన్ కార్డ్ రద్దయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోందని అయితే ఆ ప్రచారంలో వాస్తవం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు మూడు నెలలు రేషన్ కార్డులు వాడకపోతే కార్డులు రద్దవుతాయని ప్రచారం చేశాయని కానీ ఆ వార్తలను నమ్మవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సూచించింది.

    Also Read: అసీస్ దెబ్బ: కుప్పకూలిన టీమిండియా.. ఓటమి ముంగిట..

    కేంద్రం నుంచి అలాంటి మార్గదర్శకాలు వెలువడలేదని వైరల్ అవుతున్న వార్తలను ప్రజలు నమ్మవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కోరింది. కేంద్రం ఒక దేశం- ఒకే రేషన్ కార్డు స్కీమ్ ద్వారా దేశంలో ఎక్కడ ఉన్నా రేషన్ పొందే అవకాశం కల్పిస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ స్కీమ్ అమలవుతోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్