రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నోలెడ్జ్ టెక్నాలజీస్ పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 24వ తేదీన మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్టు కీలక ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం పదో తరగతి మార్కుల ఆధారంగా ఏపీలోని ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాల ప్రక్రియ జరిగేది. అయితే ఈ సంవత్సరం కరోనా వల్ల పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు.
Also Read: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్… 2,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..?
దీంతో మొదటిసారి ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల కాగా రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థుల మెరిట్ జాబితా ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. రాష్ట్రంలో పదో తరగతి పాసైన 85,755 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాగా టాప్ టెన్ లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఉండటం గమనార్హం. మెరిట్ జాబితా ద్వారా ఎంపికైన విద్యార్థులకు 2021 జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది.
Also Read: తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త.. ఆన్ లైన్ లో టెట్..?
సంక్రాంతి పండుగ తరువాత 2021 జనవరి 18వ తేదీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయి. ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులు ఆరు సంవత్సరాల పీయూసీ + బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సును చదవాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానంలో ట్రిపుల్ ఐటీలలో విద్యా బోధన జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు స్కాలర్ షిప్ లభిస్తుంది.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
ట్రిపుల్ ఐటీలలో చేరిన విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన ఉండటం వల్ల మెరుగైన ఉద్యోగవకాశాలు లభిస్తాయి. http://www.rgukt.in/ వెబ్ సైట్ ద్వారా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లకు సంబంధించిన ఇతర సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.